కోహ్లీ సెంచరీ వృధా.. మూడో వన్డేలో భారత్‌పై నెగ్గిన ఆసీస్

రాంచీ: మూడో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 104, అరోన్ ఫించ్ 93, మ్యాక్స్‌వెల్47, స్టోయిన్స్ 31 పరుగులు చేశారు. 314 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 281 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 123, విజయ్ శంకర్ 32, ధోనీ 26, జాదవ్ 26, రవీంద్ర జడేజా 24 పరుగులు చేశారు. కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 41వ సెంచరీ సాధించాడు.

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా, ఆసీస్ ఒక మ్యాచ్ గెలిచింది.

ఈనెల పదిన మొహాలీలో నాలుగో వన్డే జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*