బీజేపీలోకి గంభీర్.. ఢిల్లీ నుంచి బరిలోకి?

బీజేపీలోకి గంభీర్.. ఢిల్లీ నుంచి బరిలోకి?

ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ఓ వార్త నిజమతే టీమిండియా మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్, నవజోత్ సింగ్ సిద్ధు సరసన గంభీర్ అతి త్వరలోనే చేరనున్నాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గంభీర్ ఢిల్లీ నుంచి బరిలోకి దిగబోతున్నాడన్నదే ఆ వార్త. బీజేపీ సీనియర్ నేత ఈ విషయాన్ని చెప్పినట్టు ప్రముఖ దినపత్రిక ఒకటి పేర్కొంది.

 

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే గంభీర్.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందిస్తాడు. ఇటీవల పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు తొలుత స్పందించింది కూడా గంభీరే. ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ పాత్ర ఉందన్న ఆరోపణలు రావడంతో ఆ దేశాన్ని క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేశాడు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపింది చాలని, ఇక యుద్ధ రంగంలోనే చర్చలు జరపాలంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు.

 

నిజానికి గంభీర్ బీజేపీలో చేరబోతున్నట్టు ఎప్పటి నుంచే వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన గంభీర్ ప్రస్తుతానికైతే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. అయితే, తాజా వార్త మాత్రం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గంభీర్‌ను ఢిల్లీ నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తోందని, నేతలు ఇప్పటికే అతడితో చర్చలు జరుపుతున్నారని ఓ సీనియర్ నేత పేర్కొన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*