ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లో జంప్‌ జిలానీలు..

హైద‌రాబాద్: ఎన్నికల తేదీ ఏ క్షణమైనా వెలువడే అవకాశముందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో పార్టీల్లో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. ప్రధాన పార్టీల్లోనే ఈ జంపింగ్ వ్యవహారం ఎక్కువగా ఉంది. ఒకరకంగా పక్క పార్టీలోకి గెంతడానికి నేతలు పోటీపడ్తున్నారు. తాజాగా టీడీపీ ఎంఎల్‌ఏ మోదుగుల వేణుగోపాల రెడ్డి వైయ‌స్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్య‌క్షుడు  వైయ‌స్‌జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. త‌న ఎంఎల్‌ఏ ప‌ద‌వికి రాజీనామా చేసి వచ్చిన మోదుగులకు జగన్ కండువా వేసి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా వైసీపీలో చేరారు.

టీడీపీ నేత చల్లా రామకృష్టారెడ్డి కూడా వైసీపీలో చేరారు.

నటి జయసుధ ఇటీవలే వైసీపీలో చేరారు.

ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి, టీడీపీ ఎంపీ అవంతి, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు తదితరులు వైసీపీలో చేరారు.

అంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు.

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన తనయుడు హితేష్‌తో కలిసి వైసీపీలో చేరారు.

 

మరోవైపు కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం స్వగృహంలో చంద్రబాబు గౌరు దంపతులను పార్టీలోకి పాణ్యం నుంచి గౌరు చరితమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.

గౌరు దంపతులతో పాటు పాణ్యం, కర్నూలు కార్పొరేషన్‌ అర్బన్‌ వార్డులు, ఓర్వకల్లు, కల్లూరు, గడివేముల మండలాల కీలక నేతలు కూడా టీడీపీలో చేరారు. గౌరు దంపతులతో పాటు కట్టమంచి విద్యాసంస్థల అధినేత కట్టమంచి జనార్దన్‌రెడ్డి, పాణ్యం సీనియర్‌ నాయకుడు తిరుపతి రెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి తదితరులు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.

గౌరు కుటుంబానికి పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల ఎంపీ టికెట్‌పై చంద్రబాబు స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది.

అంతకు ముందు వైకాపా మ‌హిళా నేత కొల్లి నిర్మ‌లాకుమారి టీడీపీలో చేరారు.

అంతకు ముందు బిగ్‌బాస్ టూ విజేత కౌశల్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*