17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా విడుదల చేశారు. 543 ఎంపీ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో పది లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయని, 90 కోట్ల మంది ఓటర్లున్నారని అరోరా చెప్పారు. తొలిసారిగా ఈవీఎంలపై ఓటర్ల ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1950.

2దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న తొలిదశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు.

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్ధానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*