మొహాలీ వన్డేలో చెత్త బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఓడిన కోహ్లీ సేన

మొహాలీ: నాలుగో వన్డేను ఆసీస్ నెగ్గింది. భారత్ విధించిన 359 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 13 బంతులుండగానే చేరుకుంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ కవాజా 91, హ్యాండ్స్‌కోంబ్ 117, ఆష్టన్ టర్నర్ 84 పరుగులు చేసి తమ జట్టును గెలిపించుకున్నారు. చివర్లో వచ్చిన టర్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. దీంతో ఆసీస్ 47.5 ఓవర్లలో విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ 95, శిఖర్ ధావన్ 143, రిషబ్ పంత్ 36 పరుగులు చేశారు.

అయితే భారత బౌలర్లు నిరాశపరిచారు. పొదుపుగా బౌలింగ్ చేయడంలోనూ, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యారు. అటు ఫీల్డింగ్‌ పరమ చెత్తగా చేశారు. దీంతో పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది.

ఆఖరుదైన ఐదో వన్డే ఈ నెల 13న ఢిల్లీలో జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*