ఎన్ఎస్ఎస్ విద్యార్ధుల కార్యక్రమాలపై ప్రశంసలు

హైదరాబాద్: బండ్లగూడ మహవీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్ధులు నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ తరపున చేపడ్తోన్న కార్యక్రమాలు ప్రశంసలందుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, జల్‌పల్లి గ్రామంలో ఈ నెల ఏడున ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో విద్యార్ధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలన్స్ అకౌంట్ల ప్రాధాన్యాన్ని తెలియజెప్పి అకౌంట్లు తెరిపించారు. ఆన్‌లైన్ ద్వారా పాన్‌కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించారు. చదువు మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలంటూ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రాపవుట్ విద్యార్ధులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు యత్నాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రతపై ఎన్ఎస్ఎస్ విద్యార్ధులు అవగాహన కల్పించారు.

క్యాంప్‌లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మున్సిపల్ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ధనుంజయ్ రెడ్డి, కళాశాల కార్యదర్శి సురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డైరక్టర్ వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంప్‌లో మొత్తం 24 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*