నటుడు శివాజీ రాజీ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీని వదిలి ఊరెళ్లిపోతున్నానన్న నటుడు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేసి సీనియర్ నరేశ్ చేతిలో ఓటమి పాలైన మరో నటుడు శివాజీ రాజీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంతోమంది ఒత్తిడి చేస్తేనే తాను ఈ ఎన్నికల్లో నిలబడ్డానని, అటువంటి తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తాను ఇండస్ట్రీలో ఉండనని, భార్యతో కలిసి సొంతూరికి వెళ్లిపోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నటుడు శ్రీకాంత్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వంటివారు తన కోసం ఎంతో కష్టపడ్డారని, వారి కష్టాన్ని తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని అన్నాడు. తాను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదని, ఇష్టం లేకుండానే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.

నరేశ్ ప్యానల్ తనపై ఎన్నో విమర్శలు చేసిందని, వాటిని ఖండించకుంటే నిజమని నమ్మే అవకాశం ఉందని భావించే మీడియా ముందుకు వచ్చినట్టు శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, అలా చేయాల్సిన అవసరం కూడా తనకు లేదన్నాడు. ఎన్నికల సమయంలో అసోసియేషన్ వ్యవహారాలపై ఎవరూ మీడియా ముందు మాట్లాడరాదన్న నిబంధనను ఉల్లఘించి మరీ నరేశ్ ప్యానల్ మీడియాకెక్కిందని శివాజీ రాజా ఆరోపించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*