జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ

గుంటూరు: సీబీఐ మాజీ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. లక్ష్మీనారాయణను జగన్ సాదరంగా ఆహ్వానించారు.

వాస్తవానికి నిన్న అర్ధరాత్రి లక్ష్మీ నారాయణ… పవన్‌తో భేటీయై చర్చలు జరిపారు.

విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లక్ష్మీనారాయాణ ఏ పార్టీలో చేరతారా అని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్‌ఆర్ఐ‌లు కూడా ఎదురుచూశారు. టీడీపీ, లోక్‌సత్తా, బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆయన చివరకు పవన్‌ పార్టీలో చేరారు.

సీబీఐలో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసులపై విచారణ జరిపారు. రాజకీయాలపై ఆసక్తితో ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. యువతను కలుసుకున్నారు. రైతు సమస్యలను తెలుసుకున్నారు. సొంత పార్టీ పెడతారని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరకు ఆయన జనసేనలో చేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*