సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌‌ను చిత్తు చేసిన కోల్‌కతా

కోల్‌కతా: ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు చిత్తుగా ఓడించింది. కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా తొలుత తడబడింది. క్రిస్ లిన్(7), రాబిన్ ఊతప్ప(35), దినేశ్ కార్తీక్(2), రాణా 68, అండ్రూ రస్సెల్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు)లతో 49 పరుగులు చేశాడు. ఫలితంగా కోల్‌కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే.. విజయం సాధించింది.

 

మరోవైపు ఏడాది నిషేధం తర్వాత బరిలోకి దిగిన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడాడు. సన్ రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్.. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 85 పరుగులు చేశాడు.

 

తాజా గెలుపుతో కోల్‌కతా గత ఆరు సీజన్లుగా తొలి మ్యాచ్‌లో గెలుస్తూ వస్తున్న రికార్డును పదిలపరుచుకుంది. ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలవడం కోల్‌కతాకు ఇది వరుసగా ఏడోసారి. 2013లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను, 2014లో ముంబై ఇండియన్స్‌ను, 2015లో మళ్లీ ముంబై ఇండియన్స్‌ను, 2016లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను, 2017లో గుజరాత్ లయన్స్‌ను, 2018లో ఆర్సీబీని ఓడించింది. తాజాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*