పారికర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్య

గోవా: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గోవా మాజీ ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పారికర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి శ్రీ పారికర్ నివాసానికి వెళ్ళి ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పారికర్‌తో 30 ఏళ్ళకు పైగా ఉన్న పరిచయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. విలువలకు కట్టుబడిన ఈతరం రాజకీయ నాయకుల్లో పారికర్ గారు కూడా ఒకరని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పారికర్ చిత్తశుద్ధి, నిజాయితీ, చేసే పని పట్ల అంకితభావం మరచిపోలేనివని, ఆయన మృతి దేశానికి ముఖ్యంగా గోవా ప్రజలకు తీరని లోటని తెలిపారు.

ఈ సందర్భంగా పారికర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పారికర్ ఆదర్శాలను పాటించడం, ప్రజా సేవలో ఆయన చూపిన మార్గంలో నడవడం వారికిచ్చే నిజమైన నివాళి అని వెంకయ్య పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*