‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. అటు ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.

 

వాస్తవానికి ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు. అయితే వర్మ నేరుగా సెన్సార్ బోర్డ్ అధికారులతో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించుకున్నారు. తద్వారా సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగేలా చూసుకున్నారు.

 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటినుంచి జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఎన్టీఆర్ పాత్రలో విజయ్ కుమార్, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్, లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞశెట్టి నటించారు. రామ్ గోపాల్ వర్మ, ఆగస్త్య మంజు దర్శకత్వం వహించారు. నిర్మాత రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి ఈ చిత్రాన్ని నిర్మించా రు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*