లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్ల వర్షం.. వర్మ ఫుల్ ఖుష్!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. అనేక వివాదాల నడుమ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. చాలా రోజులుగా సరైన హిట్‌లేక అల్లాడిపోతున్న వర్మకు ఇది గొప్ప విజయమనే చెప్పాలి.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వర్మ చూపించింది నిజమా? అబద్ధమా? అన్న విషయాన్ని పక్కనపెడితే తాను చెప్పాలనుకున్నది వర్మ చెప్పేశాడు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించాడు.

‘అసలు కథ’ ఇదే అంటూ తనకు నచ్చిన కథను ప్రేక్షకులు మెచ్చేలా తీయడంలో వర్మ విజయం సాధించాడనే చెప్పాలి. ఓల్డేజ్ లవ్ స్టోరీని సరికొత్తగా చూపించడంతో కృతకృత్యుడైన వర్మ.. మొత్తంగా లక్ష్మీపార్వతి పక్షాన నిలిచాడు. ఇక, ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ వర్మకు సంతోషాన్నే మిగిల్చింది. దాదాపు 550 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్రయత్నించగా చివరికి నైజాంలో 250 థియేటర్లకు మాత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పరిమితమైంది. దీంతో ఆ ప్రభావం కొంత కలెక్షన్లపై పడింది.

ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా జోరుమీదుంది. అమెరికాలో 125 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే 90,214 డాలర్లు వసూలు చేసింది. గురు, శుక్రవారాలను కలుపుకుని 145,928 డాలర్ల ఓపెనింగ్స్ వసూలు చేసింది.
ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రీమియర్ షోల ద్వారా 482,599 డాలర్లు రాబట్టగా.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ 102,234 డాలర్లు వసూలు చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ 90,214 డాలర్లు రాబట్టి సత్తా చాటింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*