ప్రచారంలో షర్మిలకు చేదు అనుభవం.. ఆమె ఉంగరాన్ని కాజేసేందుకు దొంగ విఫలయత్నం.. వీడియో వైరల్

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల శనివారం మంగళగిరిలో నిర్వహించిన ప్రచారంలో తన ఉంగరాన్ని పోగొట్టుకోబోయారు. వెంటనే అప్రమత్తమై దొంగల బారి నంచి తన చేతిని లాఘవంగా వెనక్కి తీసుకోవడంతో తన ఉంగరాన్ని రక్షించుకోగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మంగళగిరిలో శనివారం షర్మిల బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. షర్మిలతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. వీరి ఉత్సాహాన్ని చూసిన షర్మిల వారి వారితో చేతులు కలిపారు. ఈ క్రమంలో ఓ దొంగ వారిలో కలిసిపోయి షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె చేయి అందించగానే ఆ దొంగ షర్మిల చేతికి ఉన్న ఉంగారాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన షర్మిల తన చేతిని బలంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆమె ఉంగరం సేఫ్ కాగా, దొంగ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*