బెంగళూరును చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు చిత్తుగా ఓడించింది. 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ తమ ముందుంచిన 232 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో కోహ్లీ టీమ్ విఫలమైంది. మహ్మద్ నబీ స్పిన్ మాయాజాలంతో 10 ఓవర్లలోపే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. హెట్మేర్(9), పటేల్ 11, డివిలియర్స్(1) విరాట్ కోహ్లీ(3), మొయిన్ అలీ(2), బర్మన్(19), ఉమేశ్ యాదవ్(14), గ్రాండ్‌హోం(37) పరుగులు చేశారు. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 19.5 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లలో నబీ 4, సందీప్ 2 వికెట్లు తీశారు.

 

సన్ రైజర్స్ జట్టులో బెయిర్‌స్టో 114, విజయ్ శంకర్(9), వార్నర్‌ 100, పఠాన్ 9 పరుగులు చేశారు. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*