జగన్ మరో కుట్రకు రెడీ అవుతున్నాడు.. జాగ్రత్త: నేతలను అప్రమత్తం చేసిన చంద్రబాబు

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న జగన్ మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.

పింఛన్‌ డబ్బులు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని, నాలుగైదు రోజుల్లోనే పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇప్పటికే రూ.1,000 జమయ్యాయని, మరో రూ.3 వేలు కూడా జమవుతున్నాయని తెలిపారు. చెక్కులు చెల్లవని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి ఇది చెంపచెట్టు కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా తెగబడతారని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*