చంద్రబాబును డిస్టింక్షన్‌లో పాస్ చేయించండి: నారా భువనేశ్వరి

కుప్ప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో డిస్టింక్షన్‌లో పాస్ చేయించాలని ఆయన సతీమణి భువనేశ్వరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కుప్పం కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో రెండువేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 75శాతం ఓట్లతో చంద్రబాబును డిస్టింక్షన్‌లో పాస్‌ చేయించాలని సూచించారు. ఎవరికీ అతివిశ్వాసం వద్దని, కార్యకర్తలందరూ ప్రజలను తప్పనిసరిగా కలవాలని భువనేశ్వరి పేర్కొన్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్ భారతి ఇప్పటికే పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర కూడా హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి సైతం ఆయన గెలుపు కోసం రంగంలోకి దిగారు. అయితే, ఆమె స్వయంగా ప్రచారానికి చేయకపోయినా టెలికాన్ఫిరెన్స్ ద్వారా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*