11 వరకు గంతులేసి వెళ్లు.. పవన్‌పై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఓవైపు ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూనే సోషల్ మీడియాలోనూ మాటల యుద్ధానికి తలపడుతున్నారు. ఘాటైన వ్యాఖ్యలతో సెగలు పుట్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్‌లో అటు చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్‌పై మరోమారు విరుచుకుపడ్డారు.

‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కల్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్దుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో ‘ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది. జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్, పావలా, పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి. కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు’ అని విజయసాయి పదునైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*