జనసేనానికి అస్వస్థత.. రంగంలోకి చిరు?

జనసేనానికి అస్వస్థత.. రంగంలోకి చిరు?

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్లు. విజయనగరంలో అభిమాని అత్యుత్సాహంతో కిందపడిపోయిన ఆయన.. ఆ తర్వాత భీమవరానికి వస్తూ నీరసపడ్డారు. దీంతో భీమవరం పర్యటన రద్దు చేసుకుని.. విజయవాడ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అల్పాహారం తర్వాత భోజనం చేయకపోవడంతో ఆయన నీరసపడ్డారని.. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన గుంటూరు, తెనాలి, సత్తెనపల్లిలలో జరగాల్సిన సభలు రద్దయ్యాయి.

 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ప్రచారానికి దూరమైతే.. చిరంజీవి పగ్గాలు అందుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. రంగంలోకి చిరంజీవి దిగుతున్నారని.. ఆయనే ప్రచారం చేయనున్నారంటున్నారు. జనసేన తరఫున మెగాస్టార్ ప్రచారం చేస్తారా.. లేదా అన్న సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. జనసేనకు చిరు ప్రచారం చేస్తే.. కచ్చితంగా ప్రభావం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చిరు ప్రచారం చేస్తారన్న వార్తలే నిజమైతే.. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో అంతకు మించి ఆనందం మరొకటి ఉండదంటున్నారు. అన్నీ తానై ప్రచారం చేస్తున్న జనసేనానికి.. చిరు అదనపు బలమేనంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే… జనసేన వర్గాలు ప్రకటించే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి జపాన్ పర్యటనలో ఉన్నారు. వేసవి విడిది కోసం సతీసమేతంగా జపాన్‌కు వెళ్లారు చిరు. తమ్ముడికి అస్వస్థత నేపథ్యంలో చిరు జపాన్ నుంచి భారత్‌కు బయలుదేరారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*