కుత్బుల్లాపూర్ సత్ జ్ఞాన్ కళావేదిక ఆధ్వర్యంలో వికారి నామ ఉగాది కవి సమ్మేళనం

కుత్బుల్లాపూర్ : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సత్ జ్ఞాన్ కళావేదిక ఆధ్వర్యంలో వికారి నామ ఉగాది కవి సమ్మేళనం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సత్ జ్ఞాన్ హైస్కూల్‌లో ఈ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాల కథా మంజూష పుస్తకావిష్కరణ మరియు పరిచయ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధి డా. తిరునగిరి మాట్లాడుతూ తెలంగాణ మట్టి సాహిత్యానికి నిలయమని, రచనలతో సమాజాన్ని కవులు ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలను రక్షించాలన్నారు. సత్ జ్ఞాన్ కళా వేదిక అధ్యక్షులు చింతల మల్లేశం మాట్లాడుతూ ఉగాది పర్వదిన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవులను సత్కరించుకోవడము అదృష్టమన్నారు. వికారినామ సంవత్సరం విజయాలు పంచాలన్నారు.

నేతాజీ హైస్కూల్ కరస్పాండేంట్ చింతల మహేష్, కథాశిల్పి ఐతా చంద్రయ్య, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, మేడ్చల్ రచయితల సంఘం అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్ కవులు బండకాడి అంజయ్య, వరుకోలు లక్ష్మయ్య, పెందోట వెంకటేశ్వర్లు, కోణం పరుషరాములు, బస్వ రాజ్ కుమార్, జబర్దస్త్ లక్ష్మి కిరణ్, గంభీరావుపేట యాదగిరి, డబ్బికార్ సురేందర్, అదిమూలం చిరంజీవి, ఎనిశెట్టి సతీష్ కుమార్, గొర్రె రాజేందర్, కమ్మరి శ్రీనివాస చారి, శాడ వీరారెడ్డి, గుళ్ళపల్లి తిరుమల కాంతిక్రిష్ణ, మల్లాబజ్జుల చంద్రశేఖర శర్మ, ఉప్పల పద్మ, శంభుని కుమార్, బీవీఆర్ మూర్తి, చరణ్, జనమంచి, బలవర్ది రాజు, వాకిటి రాంరెడ్డి, ఐరేని కృష్ణవేణి, పగిడిపల్లి సురేందర్, జయశ్రీ తదితర కవులు కవితా గానం చేసి సత్కారాలు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*