ఈ నెల 8 నుంచి రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో వేసవి శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ‘శ్రద్ధ’ పేరుతో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్టిఫికేట్‌ కోర్సు రూపొందించారు. వేసవి సెలవుల్లో ఈ నెల 8న ప్రారంభమయ్యే క్యాంపు ఈ నెల 20 వరకు జరగనుంది. తరగతుల్లో భాగంగా యోగాసనాలు, వివేకా మెడిటేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, శీల నిర్మాణం, నాయకత్వ నైపుణ్యాలు, విజయానికి 3హెచ్ ఫార్ములా, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు.. మొదలైన అంశాలు బోధిస్తారు.

అటు పాఠశాల విద్యార్థుల కోసం ఏప్రిల్ 22న సంస్కార్ – 2019 పేరుతో 15 రోజుల క్యాంప్ ప్రారంభం కానుంది. 4,5,6,7 తరగతులలోకి ప్రవేశించే విద్యార్థుల కోసం నిర్వహించే ఈ క్యాంప్ మే 6 వరకు కొనసాగనుంది.

ఇటు 8,9,10 తరగతులలోకి ప్రవేశించే వారి క్యాంప్ మే 8న ప్రారంభమై మే 22 వరకు కొనసాగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఈ తరగతులలో యోగాసనాలు, భజనలు, ధ్యానం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు, నైతిక పాఠాలు, పరిశుభ్రత, సమయపాలన, స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ నిర్మాణం మొదలైన అంశాలను విద్యార్థులకు నేర్పించనున్నారు.

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*