తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది 2019 వేడుకలు ఇక్కడి సెంగ్‌ కాంగ్‌లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో ఏప్రిల్ 6న ఘనంగా జరిగాయి. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలంటూ ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 800 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి మరియు ప్రసాదం పంపిణి చేశారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, ప్రసాదం దాతలకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, మరియు కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, మరియు ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ మరియు ఆవుల శివ ప్రసాద్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి నంగునూరి వెంకట్ రమణ, గోనె నరేందర్, కల్వ రాజు, రోజా రమణి, పద్మజ, ప్రసాద్ తదితరులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*