రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్: విద్యార్థులకు, యువతకు ఉపయోగకరమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ముందుండే రామకృష్ణమఠం.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 14 నుంచి ఆరు ఆదివారాల పాటు వ్యక్తిత్వ వికాస కోర్సు నిర్వహించ తలపెట్టింది. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, యువ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ తరగతుల రూపకల్పన జరిగింది. ‘‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’’ డైరెక్టర్ స్వామి బోధమయానందతో పాటు ఇతర అనుభవజ్ఞులు విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు.

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*