ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్: నాంపల్లిలోని భారత ఆహార సంస్థ, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో భారత రత్న డా.అంబేద్కర్ 128 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో సంస్థ డీజీఎంలు ఛత్రు నాయక్, ఘనశ్యామ్, విక్టర్ అమల్ రాజ్, తండు రాజు, విజయ కుమార్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన పలువురు వక్తలు జాతి నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ కృషిని స్మరించుకున్నారు. ప్రత్యేకించి ఒక విశిష్ట చరిత్ర కలిగిన భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ అంబేద్కర్ తీసుకున్న చొరవనూ, చేసిన సేవనూ కొనియాడారు.

అదేవిధంగా, అంబేద్కర్ కలలు కన్న సమసమాజ స్థాపన దిశగా తమ వంతుగా పాటుపడతామని సంస్థ ఉద్యోగులు ప్రతినబూనారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*