తాతయ్యల్ని చిన్నపిల్లల్ని చేసే ఆటలు

హైదరాబాద్: పబ్జీ లాంటి వీడియో గేమ్స్‌కు బానిసలైన నేటి తరానికి నలభై, యాభై ఏళ్ల క్రితం నాటి మన ఆటలను పరిచయం చేసేందుకు అర్చనా రెడ్డి, సంగీతా రాజేశ్ అనే మహిళా డిజైనర్లు నడుం కట్టారు. గుడ్ ఓల్డ్ గేమ్స్ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఓ ఎగ్జిబిషన్ కూడా ప్రారంభించారు. వైకుంఠపాళి, పరమపద సోపానం, వామనగుంటలు, అష్టా చెమ్మ, దాడి, చదరంగం, పులి జూదం, పచ్చీస్ తదితర పాతతరం సంప్రదాయ ఆటలను నేటి తరానికి అందిస్తున్నారు. 150 ఆటలను ముప్పై కేటగిరీలుగా చేసి వివిధ సైజుల్లో 101 డిజైన్లలో అందించారు. వుడ్, క్లాత్‌తో పాటు బాక్స్‌లపై కూడా ఈ డిజైన్లను పొందుపరిచారు. ఏడాదికిపైగా దేశవ్యాప్తంగా పర్యటించి అధ్యయనం చేశారు. శ్రీకాళహస్తి, గోవా, కర్ణాటక, మధురై, చెన్నపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణానికి హాని చేయని విధంగా క్రీడా ఉత్పత్తులు రూపొందించారు. మొత్తం 132 డిజైన్లు ఎగ్జిబిషన్‌లో కనువిందు చేస్తున్నాయి. బాహుబలి చదరంగం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనకు అనూహ్య స్పందన వస్తుండటంపై సంగీత, అర్చన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా తాము చేస్తున్న యజ్ఞానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.హైదరాబాద్: ఏళ్ల క్రితం నాటి భారతీయ సంప్రదాయ ఆటలను నేటి తరానికి పరిచయం చేసేందుకు అర్చనా రెడ్డి, సంగీతా రాజేశ్ అనే ఇద్దరు డిజైనర్లు రంగంలోకి దిగారు. గుడ్ ఓల్డ్ గేమ్స్ పేరుతో హైదరాబాద్‌ బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. వైకుంఠపాళి, వామనగుంటలు, అష్టా చెమ్మ, దాడి, చదరంగం, పులి జూదం, పచ్చీస్, పరమపద సోపానం తదితర పాతతరం సంప్రదాయ ఆటలను నేటి తరానికి అందిస్తున్నారు. 150కి పైగా ఆటలను ముప్పై కేటగిరీలుగా చేసి వివిధ సైజుల్లో 101 డిజైన్లలో అందించారు. వుడ్, క్లాత్‌తో పాటు బాక్స్‌లపై కూడా ఈ డిజైన్లను పొందుపరిచారు. ఏడాదికిపైగా శ్రీకాళహస్తి, గోవా, కర్ణాటక, మధురై, చెన్నపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించి క్రీడా ఉత్పత్తులు తయారు చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చిన పెద్దలు కూడా చిన్నపిల్లల్లా మరి ఆటలాడుకుంటూ తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అర్చనా రెడ్డి, సంగీతా రాజేశ్‌లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*