హైదరాబాద్ జట్టుపై నెగ్గిన చెన్నై

చెన్నై: ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో వాట్సన్ 96, రైనా 38, అంబటి రాయుడు 21 , జాదవ్ 11 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

హైదరాబాద్ ఆటగాళ్లలో వార్నర్ 57, మనీష్ పాండే 83, శంకర్ 26, పఠాన్ 5 పరుగులు చేశారు. తాజా విజయంతో చెన్నై జట్టు 16 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*