“నాదవినోదము నాట్యవిలాసము”

హైదరాబాద్: ఈనెల 25న సాయంత్రం రవీంద్రభారతిలో చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన అలరించబోతోంది! 50 మంది చిన్నారుల ప్రదర్శనలో 9మంది అరంగేట్రం చేస్తున్నారు. హైదరాబాద్ శారద నృత్యనికేతన్ డైరెక్టర్ శైలజా ప్రసాద్ సమక్షంలో శిక్షణ పొందిన పిల్లలంతా.. అభినయ వేదంతో సభకనువాదం చేయబోతున్నారు. భావయుక్త భంగిమలతో, జతియుత గమనాలతో, నటరాజుడి పాదాల దగ్గర చిన్నారులు సుమరజాన్ని అర్పించబోతున్నారు.

ఈ కూచిపూడి నాట్య ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. విశిష్ట అతిథులుగా డీసీపీ పీవీ పద్మజ, నల్లా మనోహర్ రెడ్డి, నాట్యకళానిధి చింతా ఆదినారాయణ వస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*