రామకృష్ణ మఠంలో ఊపందుకున్న సమ్మర్ క్యాంప్‌ అడ్మిషన్లు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సంస్కార్-2019 పేరుతో 15 రోజుల క్యాంప్‌ నిర్వహించనుంది. 8,9,10 తరగతులలో ప్రవేశించే విద్యార్ధులు దీనికి అర్హులు. మే 8న ప్రారంభమయ్యే ఈ శిబిరం మే 22 వరకు కొనసాగునుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఈ తరగతులలో యోగాసనాలు, భజనలు, ధ్యానం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు, నైతిక పాఠాలు, పరిశుభ్రత, సమయపాలన, స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ నిర్మాణం మొదలైన అంశాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మొదటగా వచ్చినవారే అడ్మిషన్లు పొందే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రామకృష్ణ మఠం బయలుదేరండి.

రామకృష్ణ మఠంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*