కాశీలో లక్షలాది మందితో మోదీ రోడ్ షో

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న పండిట్ మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి కాశీ పురవీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో సాగింది.

అనంతరం మోదీ దశాశ్వమేధ్ ఘాట్ వద్ద నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

కాశీలో మోదీ శుక్రవారం నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. ఎన్డీయే నేతలు కూడా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరౌతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*