వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న శ్రీ తేజ్‌తో ఈ క్షణం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీ తేజ్ ఈ క్షణం‌తో అనేక అంశాలపై ముచ్చటించారు. తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

విజ‌య‌వాడ నుంచి స‌ముద్రం ఈదాల‌ని బ‌య‌లు దేరిన ఒక కుర్రాడికి కొంత దూరం ఈదిన త‌రువాత‌.. ప్ర‌యాణం సాదా సీదాగా వెళ్తున్న స‌మ‌యంలో స‌డ‌న్ గా ఒక పెద్ద ప‌డ‌వ వ‌చ్చింది. ఆ ప‌డ‌వ మీద నుంచి ఒక పెద్ద తాడు అగ‌స్త్యా మంజు అనే స్నేహితుడు విసిరి ఆ పెద్ద షిప్ లోకి ఎక్కించాడు. ఆ ప‌డ‌వ ఒక పెద్ద కంపెనీది . దాని ఓన‌ర్ ఓ క్రియేటివ్ జీనియ‌స్.. ఆయ‌న తో ప్ర‌యాణం జీవితాన్ని మ‌లుపు త‌ప్పింది అంటున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ యాక్ట‌ర్ శ్రీ‌తేజ్ తో ఈ క్ష‌ణం ఎక్స్ క్లూజీవ్ ఇంట‌ర్వూ … మీ కోసం.

 

1. హాయ్ తేజు గారు ఎలా వున్నారు ల‌క్ష్మీ స్ ఎన్టీఆర్ సినిమా తాలుక రెస్పాన్స్ ఎలా ఉంది?

శ్రీ తేజ్: హాయ్ అండీ .. నేను బావున్నాను. సినిమా విడుద‌లైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. యు ఎ‌స్ లో విడుద‌లైంది. అక్క‌డ చూసిన ఫ్రెండ్స్ ..అలాగే చెన్నైలో విడుద‌లైంది అక్క‌డ చూసిన మిత్రులు యాక్టింగ్ ను మెచ్చుకున్నారు. ఈ సినిమా స‌క్సెస్ ను నాకంటే నా పేరెంట్స్ , ఫ్యామిలీ మెంబ‌ర్స్..శ్రేయోభిలాషులు, బంధువులు బాగా ఆస్వాదీస్తున్నారు. చంద్ర‌బాబు పాత్ర‌లో నా న‌ట‌న‌ను చూసి వాళ్లంతా ఇక మా శ్రీ‌తేజ్ న‌టుడిగా నిల‌దొక్కున్న‌ట్లే అనే సంతృప్తిని వ్య‌క్త పరుస్తున్నారు. వాళ్ల సంతోషం.. సంతృప్తి నాకు మ‌రింత ధైర్యాన్ని ఇస్తున్నాయి .

( ఒకింత సంతృప్తి, ధైర్యం, సంతోషం క‌ల‌గ‌ల‌సిన న‌వ్వు…)

 

2. మీకు బెస్ట్ క్రిటిక్ ఎవ‌రు?

శ్రీ తేజ్:  నవ్వుతూ.. నా వ‌ర‌కు బెస్ట్ క్రిటిక్స్ అంటే రివ్యూ రాసే వాళ్లేనండి. ఎందుకంటే సినిమా చూసిన త‌రువాత నా యాక్టింగ్ గురించి స‌మీక్ష‌కులు రాసేవి నేను ఫీడ్ బ్యాక్ లా తీసుకుంటాను. వాళ్లతో పాటు.. మా త‌మ్ముళ్లు మంచి విమ‌ర్శ‌కులండీ. నేను ఎక్కువ మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తోనే సినిమాలు చూస్తుంటాను. విచిత్రం ఏంటంటే..నా ఫ్రెండ్స్ లో ఎక్కువుగా సినిమాలు చూసే వాళ్లు లేరు. నేను చిన్న‌ప్ప‌టి నుంచి మా త‌మ్ముళ్లు పేరెంట్స్ తోనే సినిమాలు ఎక్కువుగా చూసే వాడిని. నా ఫిల్మ్స్ అన్ని మా త‌మ్ముళ్లు చూసి ఫీడ్ బ్యాక్ చెబుతుంటారు. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి సినిమా ఫీల్డ్ లో నాతో ట్రావెల్ అవుతున్న మిత్రులు కూడా మంచి స‌ల‌హాలు ఫీడ్ బ్యాక్ రూపంలో ఇస్తుంటారండి.

 

3. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం టైటిల్స్ విష‌యంలో రామ్ గోపాల్ వ‌ర్మ గారు ఒక గొప్ప ప‌ని చేశారు . మీరు చెప్ప‌గ‌ల‌రా..?( నేను క‌్లూ ఇస్తాను అని చెప్పి).. డైరెక్ష‌న్ కు త‌న పేరు తో పాటు పక్క‌న మ‌రోక‌రి పేరు వేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి జీనియ‌స్ త‌న పేరు ప‌క్క‌న మ‌రొక వ్య‌క్తి పేరు వేయ‌డం అంటే మాములు విష‌యం కాదు.! .. నిజంగా అత‌నికి అంత ప్ర‌తిభ వుందా..? అస‌లు అత‌ని గురించి మీకు తెలిసింది ఆడియ‌న్స్ తో షేర్ చేసుకుంటారా..?

 

శ్రీ తేజ్: డైరెక్ష‌న్ టైటిల్ కార్డు లో వ‌ర్మ గారి తో పాటు.. అగ‌స్త్యా మంజు పేరు వేశారు. అవునండి నిజంగా అగ‌స్త్యా టాలెంట్ వున్న వ్య‌క్తి. వంగ‌వీటి సినిమాకు చీఫ్ అసోసియేట్ గా వ‌ర్మ గారి డైరెక్ష‌న్ లో టీమ్ లో ప‌ని చేశారు. ( హోదా ది ఏముంది లేండి అంటే..) వ‌ర్మ గారి ద‌గ్గ‌ర చీఫ్ అసిసోయేట్ అంటే ఆల్మోస్ట్ డైరెక్ట‌ర్ కింద లెక్క‌. ఎందుకంటే..ఆయ‌న ఎంపిక బావుంటుంది. క్రియేటివ్ గా ..లాజిక‌ల్ గా ఆలోచించే వాళ్ల‌ని త‌న ఆలోచ‌న‌కు దగ్గ‌ర‌గా వున్న వారినే వ‌ర్మ త‌న సినిమాల‌కు ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ మ‌రియు టెక్నిక‌ల్ విభాగాల‌కు సంబంధించి. వ‌ర్మ లాగే ఏ విధ‌మైన క‌న‌ఫ్యూజ‌న్ లేని వ్య‌క్తి అగ‌స్త్యా మంజు . నాకు వంగ‌వీటి సినిమాకు దారి చూపించింది అగ‌స్త్యానే. అలాగే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో చంద్రబాబు పాత్ర‌కు సంబంధించి మొద‌ట న‌న్న ఎంపిక చేయాల‌నే ఆలోచ‌న అగ‌స్త్యా నుంచే ప్రారంభం అయ్యింది. ఆ త‌రువాత వ‌ర్మ గారు టెస్ట్ చేసి ఓకే అయిన త‌రువాత తీసుకున్నారు. ( అగ‌స్త్యా మంజున్న గురించి నేను ఎప్పుడు ఒక చిన్న క‌థ కూడా చెబుతుంటాను .. స‌ముద్రం ఈద డానికి బ‌య‌లుదేరిన‌ ఒక కుర్రాడు ఏ ఆధారం లేకుండా బ‌ల‌మైన సంక‌ల్పంతో స‌ముద్రాన్ని ఈదుకుంటూ వెళ్తుంటే..మ‌ధ్య‌లో ఎన్నో అవంతరాలు. అయితే ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఒక పెద్ద షిప్ త‌న వైపు వ‌చ్చింది. ఆ షిప్ లో నుంచి త‌న‌కు ఒక పెద్ద తాడు వేసి ఆ షిప్ లోకి లాగింది అగ‌స్త్యా మంజున్న‌. ఆ షిప్ పెద్ద కంపెనీది. ఆ కంపెనీ యాజ‌మ‌ని .. రామ్ గోపాల్ వ‌ర్మ‌!. సొంత బ్ర‌ద‌ర్ లాంటి వాడు నాకు అగ‌స్త్యా మంజున్న‌…! అంటూ అగ‌స్త్యా మంజు గారి గురించి చెప్పాడు .

ప్ర‌.4.నాకు అగ‌స్త్యా మంజు గురించి చిన్న కథ రూపంలో చెప్పి మ‌రొక క్లూ ఇచ్చారు. ( చిరున‌వ్వు)… క‌థ ను అంత‌ బాగా నెరేట్ చేశారు క‌దా..? క‌థ‌లు ఏమైనా రాస్తున్నారా..? ఫ‌్యూచ‌ర్ లో డైరెక్ష‌న్ చేసే ఆలోచ‌న ఉందా..? ఎందుకంటే .. మీరు డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ నుంచి యాక్టింగ్ వైపు షిఫ్ట్ అయ్యారు క‌దా?

 

శ్రీ తేజ్: లేదు లేదు .. నా ఫోక‌స్ అంత యాక్టింగ్ మీద మాత్ర‌మే. ఇండ‌స్ట్రీకి మంచి యాక్ట‌ర్ ను కావాల‌నే సంక‌ల్పంతో వ‌చ్చాను. నాకు బ్యాగ్రౌండ్ ఏమి లేదు. ఇండస్ట్రిలోనే నిల‌దొక్కుకోవాలి కాబ‌ట్టి మొద‌ట ద‌ర్శ‌క‌త్వ విభాగంలో అవ‌కాశం వస్తే చేరాను. అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా నేను ఎక్కువ కాలం ప‌ని చేయ‌లేదు. మ‌నలో ఉన్న బ‌లాల్ని మ‌నం ముందు క‌చ్చితంగా తెలుసుకో గ‌లిగితే మ‌న‌కు విజ‌యం వ‌రిస్తుంద‌నే సిద్దాంతం నేను న‌మ్ముతాను . న‌టుడిగా నేను మెప్పించ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌కం. అందుకు స‌రిప‌డ ల‌క్ష‌ణాలు అన్ని నాలో ఉన్నాయ‌ని నేను తెలుసుకున్నాను. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తూ.. ఇప్ప‌టికి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో మ‌న ప్రేక్ష‌కుల‌తో పాటు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌గ‌ల‌గుతున్నాను.

#Going to release #Mayday #may1st #release in #Andhrapradesh #LakshmisNTR @RGVzoomin @Shritejoffical @Agsthyamanju #Shritej #actorshritej #ActorShritej

Posted by Shri Tej on Friday, April 26, 2019

ప్ర‌5. ఇది స‌ర‌ద‌గా చేసే చిట్ చాట్ కాబ‌ట్టి ఒక ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నాను. కాలేజే డేస్ లో ల‌వ్ ఎఫైర్స్ ఏవైనా ఉండేవా తేజు కూ..?

 

శ్రీ తేజ్: అబ్బే తేజుకు అటువంటివి ఏమి ఉండేవి కాదండి. ( న‌వ్వు..) ఎందుకంటే మా నాన్న గారు చాల స్ట్రిక్ట్ గా ఉండేవారు. శ్ర‌ద్ద‌గా చ‌దువుకోవ‌డం .. మిగిలిన స‌మ‌యం ఆట‌లు.. ఆ త‌రువాత ఫ్యామిలీ మెంబ‌ర్స్ తోనే ఉండేవాళ్లం. ఇప్ప‌టికి మా నాన్న‌గారు అంటే నాకు ఏదో గౌర‌వంతో కూడిన తెలియ‌ని భ‌యం. ఏదైనా కావాలంటే మా అమ్మ‌కు చెప్పి అడిగిస్తాను. నేనే కాదు మా త‌మ్ముళ్లు అయినా అంతే .. ( అదేంటి మ‌రి అంత స్ట్రిక్టా పిల్ల‌ల‌కు కొంత‌ఫ్రీడ‌మ్ ఇవ్వాలి కదా అని అడిగితే…) వాళ్ల జ‌న‌రేష‌న్ అంతా అంతే. మా తాత గారు కూడా స్ట్రిక్ట్ గా ఉండేవారు. మొత్తం మీద కాలేజ్ డేస్ అనే కాదు సినిమా ఇండ‌స్ట్రి లో కూడా ప్రేమ వ్య‌వ‌హారాలు లేవండి. నా ధ్యాసంతా ప‌ది కాలాల పాటు మంచి న‌టుడిగా ఇండ‌స్ట్రిలో కొన సాగాలి. న‌టుడిగా నాదైన ముద్ర జాతీయ స్థాయిలో వేయాలి అనేవి నా ల‌క్ష్యాలుగా పెట్టుకున్నాను.

6. ఇక మీది కృష్ణా జిల్లా విజ‌య‌వాడ న‌గ‌రం అని తెలుసుకున్నాను. మ‌రి మీరు పుట్టి పెరిగిన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇది రౌడియిజానీకి కూడా చిరునామ గా చెబుతారు. అస‌లు మీ వ్య‌క్తిత్వం పై మీ న‌గ‌రం యొక్క ప్ర‌భావం ఏ విధంగా ఉంది ?

 

శ్రీ తేజ్: విజ‌య‌వాడ అంటే రౌడియిజం కాదండీ.. విజ‌య‌వాడ అంటే మంచి ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ గా పేరు. నాకు ఉహ తెలియ‌న‌ప్పుడు విజ‌య‌వాడ లో రౌడియిజం ఉండి ఉండొచ్చు కానీ.. నా దృష్టిలో సిటి అనేది బెస్ట్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ . సిటి క‌ల్చ‌ర్ బావుంటుంది. ఇక్క‌డ వాట‌ర్ బావుంటాయి . నా వ‌ర‌కు అన్ని ర‌క‌లా ఆటలు లైక్ షటిల్…క‌బడి, వాలీబాల్, ఫుట్ బాల్ , క్రికెట్ ఇలా అన్ని ర‌కాల ఆటలు ఆడేవాడిని. ఇవ‌న్నీ కూడా సిటిలో భాగం . ఇక సినిమా ప‌రిశ్ర‌మకు కృష్ణా జిల్లాతో చాల ద‌గ్గ‌ర సంబంధం ఉంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్లు గా పిలిచే ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లు .. మహాన‌టి సావిత్రిగారు.. రాజేంద్ర ప్ర‌సాద్.. ఇలా ఎంతో మంది గొప్ప న‌టీ న‌టుల‌తో పాటు అనేక మంది నిర్మాత‌లు , ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు ఈ జిల్లా నుండి వున్నారు.

 

7. విజ‌య‌వాడ సిటి లో మీకు బాగా ఇష్ట‌మైన ఫుడ్ ఏది?

శ్రీ తేజ్: త‌ల‌ కొంచెం పైకెత్తి ఎంట‌బ్బా అన్న‌ట్లు ఆలోచిస్తూ..ఆ..విజ‌య‌వాడ‌లో చిన్న పునుగులు ఫేమ‌స్ .ఈవెనింగ్ స్నాక్స్ గా వీటిని బాగా తింటారు .హైద‌రాబాద్ లో కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చిన్న పునుగులు ఈ మ‌ధ్య చేస్తున్న‌ట్లున్నారు కానీ.. ఇక్క‌డ కంటే ముందే విజ‌య‌వాడ లో చేసేవారు. హైద‌రాబాద్ లో చాట్ బండార్.. స‌మోసాలు .. ఛాయ్ లు ఫేమ‌స్ . విజ‌య‌వాడ లో చాట్ లు ఉండ‌వు. పెద్ద‌గా అక్క‌డ ఇష్ట‌ప‌డ‌రు కూడ‌..(మ‌రి మీరు శాఖ‌హారం తింటారా..మాంసాహారం తింటారా అని అడిగిన ప్ర‌శ్న‌కు …నేను రెండు ర‌కాల ఫుడ్ తింటాను . తిన‌డ‌మేనా ( ఏమైనా వంట చేస్తారా అని అడిగితే.. (న‌వ్వుతూ) బ్యాచిల‌ర్స్ గా ఉన్న‌ప్పుడు వంట చేసుకోక త‌ప్ప‌దు క‌దండీ. ఏది బాగా వండుతారు ? చికెన్ బాగానే చేస్తానండి..! మ‌రీ స్పైసీగా ఉండ‌దు. ఆర్టిస్టులు ఏ త‌ర‌హా నాన్ వెజ్ ను ఇష్ట‌ప‌డ‌తారో(డైట్ కాన్షీయ‌స్‌)..ఆ త‌ర‌హాలో చికెన్ చేస్తానండి..విజ‌య‌వాడ లో కృష్ణా న‌దిలో దొరికే చేప కూడా చాల బావుంటుంది. ఫిష్ కూడా నాకు ఇష్టం.

 

ప్ర‌శ్న‌. 8. నాకు మిమ్మ‌ల్ని చూస్తుంటే ఎందుకో డౌట్ వ‌స్తుంది. చూడ‌టానికి ఇన్నోసెంట్ గా వున్నారు. లుక్ ప‌రంగా కూడా బావున్నారు. కానీ ల‌వ్ ఎఫైర్స్ మాత్రం ఏమి లేవు అంటున్నారు. న‌మ్మోచ్చు అంటారా …( బాగా న‌వ్వుతూ…)

 

శ్రీ తేజ్: లేదండి నేను విజ‌య‌వాడ లో ఉన్న‌ప్పుడు ఖాళీ సమ‌యం దొరికితే స్పోర్ట్స్ తో బిజీ అయ్యే వాడిని. న‌న్ను ఎవ‌రైన ఇష్ట‌ప‌డి వుంటారేమో కానీ.. నేను మాత్రం ఎప్పుడు ప్రేమించాలి.. ప్రేమించ బ‌డాలి అని దృష్టి పెట్టలేదు. సినిమా ఇండ‌స్ట్రికి నేను క‌చ్చిత‌మైన గోల్ తో వ‌చ్చాను. ఏదో ఒక రాయి విసిరి వెళ్ధామ‌ని అయితే రాలేదు. న‌టుడిగా నాకంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకోవాల‌నే ల‌క్ష్యంతో వ‌చ్చాను. ఆ ల‌క్ష్యంతో నేను వేరే విష‌యాల‌పై డైవ‌ర్ట్ అవ్వ‌కుండా ప‌ని చేసుకుంటూ వెళ్తున్నాను .సినిమా ప్ర‌పంచం చెప్పాలంటే ఒక మాయ ప్ర‌పంచం …ఇక్క‌డ అన్ని వుంటాయి. అయితే ఎలా ఉండాలి అనేది మన ఇష్టం..మ‌న వ్య‌క్తిత్వం..ఆలోచ‌ల్ని బ‌ట్టే వుంటుంది . మ‌హా భార‌తంలో విశ్వామిత్రుడు ఘోర త‌ప‌స్పు చేస్తుంటే.. మేన‌క వ‌చ్చి అత‌ని త‌ప‌స్సు ను భంగం చేస్తుంది. అటువంటివి నేను గొప్ప లెస‌న్స్ గా మైండ్ లో పెట్టుకుంటాను. నిరంతంరం నా ల‌క్ష్య సాధ‌న‌..నేను చేస్తున్న ప‌ని ప‌ట్ల‌నే డెడికేష‌న్ తో వుంటాను. ఉండాల‌ని నేను ముందుగానే నిర్ణ‌యించుకున్నాను. ఎందుకంటే సినిమా అనేది చాల శ‌క్తి వంత‌మైన మీడియా.. !

 

ప్ర‌9. మాయ ప్ర‌పంచం అన్నారు కాబ‌ట్టి ఇంకో ప్ర‌శ్న అడ‌గాల‌నిపిస్తుంది. ఆ మ‌ధ్య ఇండ‌స్ట్రిలో కాస్టింగ్ కౌచ్ విష‌యం పై పెద్ద ర‌భ‌స జ‌రిగింది క‌దా.. నిజంగా ఇండస్ట్రిలో మ‌హిళ‌ల‌పై ఆ రేంజ్ లో లైంగిక వేధింపులు ఉంటాయా..?

శ్రీ తేజ్: ఈ ప్ర‌శ్న అడిగ్గానే.. న‌వ్వుతూ..వ‌ద్దులేండి ఈ ప్ర‌శ్న‌.. వ‌దిలేద్దాం అన్నారు.ఫోర్స్ చేయ‌డం ఎందుకులే అని నేను కూడా పొడ‌గించ‌లేదు..!

ప్ర‌శ్న‌.10.సినిమా ఇండస్ట్రి అంటే గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ క‌దా.! ఇక్క‌డ చీక‌టి కోణాలు ఏమి ఉండ‌వా..?

శ్రీ తేజ్: ఒక విష‌యం అండి.. `Empty mind is devils mind`అంటారు క‌దా. వాస్తవంగా సినిమా ఫీల్డ్ చాల చిన్న‌ది. కానీ పెద్ద‌గా ప్రొజెక్ట్ అవుతుంటుంది. అందువ‌ల్ల మా మీద ఫోక‌స్ కూడా ఎక్కువుగానే వుంటుంది. మిగిలిన వార్త‌ల‌కంటే ..సినిమా వాళ్ల కు సంబంధించిన వార్త‌లు కొంత ఆస‌క్తిని క‌లిగిస్తాయి అనే ఉద్దేశ్యంతో మీడియా ఫోక‌స్ కూడా ఎక్కువుగా వుంటుంద‌నిపిస్తుంది. ఇక్క‌డ మీరు ఊహిస్తున్న‌ట్లు అంత చెడ్డ‌గా ఏమి ఉండ‌దు. మ‌నం క‌రెక్ట్ గా ఉంటే మ‌న‌ల్ని ఎవ‌రు ఫోర్స్ చేసి చెడు చేయించ‌లేరు. నా వ‌ర‌కు నేను ఖాళీ గా వున్న‌ప్పుడు.. కుకింగ్..డ్రాయింగ్.. రీడింగ్.. కొన్ని పాత సినిమాలు చూడ‌టం.. యాక్టింగ్ ప్రాక్టిస్ చేసుకోవ‌డం వంటివి చేస్తుంటాను. నా మైండ్ ను ఎప్పుడు ఖాళీగా వుంచ‌ను. ఎప్పుడు ఏదో ఒక వ్యాప‌కంతో బిజీ చేస్తాను. ప్ర‌తి ఫీల్డ్ లో వున్న‌ట్లే సినిమా ఇండస్ట్రిలో కూడా కొన్ని స‌మ‌స్య‌లుంటాయి ..అంతే త‌ప్ప‌.. సినిమా ఇండ‌స్ట్రి అంతా బ్యాడ్ అన‌డం క‌రెక్ట్ కాదు .

ప్ర‌శ్న‌.11.మీరు చెబుతున్న స‌మాధానాల్ని బ‌ట్టి నాకు మీ మీద ఒక సందేహాం వ‌చ్చింది. మీకు బుక్స్ బాగా చ‌దివే అల‌వాటు వుంద‌న్నుకుంట‌.. తెలుగు సాహిత్యం ఏమైన ప‌రిచ‌యం ఉందా.. ?శ్రీశ్రీ పుస్త‌కాలు.. బాల‌గంగాధ‌ర్ అమృతం కురిసిన రాత్రి పుస్త‌కం..కొడ‌వ‌గంటి కుటుంబ‌రావు గారి బుక్స్ ఏమైనా చ‌దివారా…?

 

శ్రీ తేజ్: నేను అడుగుతుంటే..ఆయ‌న న‌వ్వుతు.. మీరు అడిగిన బుక్స్ అయితే నేను ఒక్క‌టి కూడా చ‌ద‌వ‌లేదండి. నేను చ‌దివేది ఒకే ఒక్క‌టి అది ధియేట‌ర్ లో సినిమా. అవును నేను సినిమాను చ‌దువుతాను. దాని నుంచి ఎంతో నేర్చుకోవ‌చ్చు. తెలుగు, ఇంగ్లీషు, హింది.. కొరియా , భాష‌

ఏదైనా కావోచ్చు. సినిమా నుంచి చాలా నేర్చుకుంటాను. డిజాస్ట‌ర్ సినిమా నుంచి కూడా చాలా నేర్చుకోవ‌చ్చు. నేను బుక్స్ పెద్ద‌గా చ‌ద‌వ‌ను కానీ.. కొటెష‌న్స్ బాగ చ‌దువుతాను.

ప్ర‌శ్న‌.12. ఇండ‌స్ట్రి లో మీకు గాడ్ ఫాద‌ర్ ఎవ‌రైనా ఉన్నారా..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌రువాత సినిమా క‌ష్టాలు ముఖ్యంగా ఆర్ధిక ప‌ర‌మైన ట్ర‌బుల్స్ ఎలా ఓవ‌ర్ క‌మ్ చేశారు..?

 

శ్రీ తేజ్: నేను ఒంటిరిగా వ‌చ్చాను . బ్యాగ్రౌండ్ ఎవ‌రు లేరు. గాడ్ ఫాద‌ర్స్ అంటు ఎవ‌రు లేరండి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌రువాత‌.. కొద్ది మంది స్నేహితులు అయ్యారు. వారిలో నేను చాల సార్లు చెప్పాను నాకు పెద్ద‌న్న‌య్య లాంటి వాడు అగ‌స్త్యా మంజు( ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం లో వ‌ర్మ డైరెక్ష‌న్ కు త‌న పేరు ప‌క్క‌న ఇత‌ని పేరు కూడా వేశారు) అని. ఇక ఆర్ధిక ప‌ర‌మైన విష‌యాలు అంటారా.. నేను బికామ్ చ‌దివాను. నాకు ఎకౌంట్స్.. అర్ధ శాస్త్రం ఇష్ట‌మైన స‌బ్జెక్ట్ లు . నేను మిగిత స‌బ్జెక్ట్ లు డుమ్మ కొట్టిన‌ప్ప‌టికి అకౌంట్స్..అర్ధ శాస్త్రం స‌బ్జెక్ట్ క్లాసులు ఎప్పుడు మిస్ కాలేదు. ఈ రెండు స‌బ్జెక్ట్ ల ప్ర‌భావం మ‌నీ మేనేజ్ మెంట్ ను బాగా నేర్పించాయి. డ‌బ్బు బాగా వ‌స్తుంటే సిక్స్ ప్యాక్ లాంటివి ఓ 6 నెల‌లు క‌ష్ట‌ప‌డి చేసి ఆడియ‌న్స్ ను స‌రికొత్త‌గా మెప్పించ వ‌చ్చు. మ‌న ఖ‌ర్చుల‌కే స‌రిపోయేట‌ప్పుడు ఖ‌ర్చు మ‌రింత పెంచుకోవ‌డం మంచింది కాద‌నుకుంటాను. ఇక నేను ఇబ్బంది ప‌డిన స‌మ‌యంలో కూడా ఎవ‌రీకి చెప్పుకోలేదు. నాలో నేనే స్ట్ర‌గుల్ అయ్యాను. న‌న్ను నేనే సెల్ఫ్ మొటీవేట్ చేసుకునేవాడిని.

 

ప్ర‌.13. మీరు పాజిటివ్ థింక‌ర్ అని అర్ధం అవుతోంది. ఎంత పాజిటివ్ గా ఆలోచించిన‌ప్ప‌టికి ఒక్కోసారి డౌన్ కావ‌డం స‌హ‌జం. అలా మీరు ఎప్పుడైన అస‌లెందుకు సినిమాను కెరీర్ గా ఎంచుకున్నాను .. హాయగా జాబ్ చేసుకుంటే బావుండేద‌నిపించిన సంద‌ర్భాలున్నాయా..?

 

శ్రీ తేజ్: సినిమా ఇండ‌స్ట్రి కాకుండ జాబ్ చేసుకుంటే బావుండేది అని అనిపించిన సంద‌ర్భాలున్నాయండి. అయితే ఆ లోచ‌న ఎలా వ‌చ్చేది అంటే ..ఫ్రెండ్స్ కార‌ణంగా వ‌స్తుంటుంది. ఎందుకంటే నేను ప‌డే స్ట్ర‌గుల్స్ వాళ్లు చూస్తుంటారు క‌దా.నా మ‌న‌సులో లేక పోయిన‌ప‌ప్ప‌టికి వాళ్లే..ఇంకేనాళ్లురా.. ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయితే మంత్లీ ఇన‌క‌మ్ ఉంటుంది లైఫ్ బెట‌ర్ గా ఉంటుంద‌నే ఆలోచ‌న క‌లిగిస్తారు. అప్పుడు నేను జాబ్ జాయిన్ అయి నాకు నేను ఎక్స్ పీరియ‌న్స్ అవుతాను.. అది సంతృప్తి గా లేద‌ని.. ఇంకోసంవ‌త్స‌రం సినిమాల్లోనే ట్రై చేస్తాను అని చెప్పే వాడిని. వాస్త‌వంగా నేను బ‌య‌ట‌కు వెళ్లి అడిగితే నాకు రెగ్యుల‌ర్ రోల్స్ వ‌స్తుంటాయండి. అయితే నేను ఏది ప‌డితే అది చేసేయాల‌నుకోవ‌డం లేదు. న‌టుడిగా నాకంటూ ఒక గుర్తింపు తో పాటు.. ప‌ది కాలాల పాటు ఇండ‌స్ట్రిలో కొన సాగాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాను.వంగ‌వీటి చిత్రం త‌రువాత నేను ఏది ప‌డితే అది చేస్తే.. నాకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో అవ‌కాశం వ‌చ్చేది కాదేమో..ఎక్కువుగా క‌నిపించ‌క పోవ‌డమే .. ల‌క్ష్మీస్ ఎన్టఆర్ లో చంద్ర‌బాబు గారి రోల్ కు ఫ్రేష్ లుక్ అనిపించింది ప్రేక్ష‌కుల‌కు . ఏదో ఒక రోల్ చేస్తే కొంచెం డ‌బ్బులు రావోచ్చు కానీ.. వృత్తి ప‌రంగా సంతృప్తి అనిపించ‌దు .ఇక అవ‌కాశాలు బాగా రాలేద‌ని బాధ ప‌డే తత్వం కాదు. ఏది జ‌రిగినా మ‌న మంచికే అని భావించే త‌త్వం నాది.

 

ప్ర‌.14. మీకు బ‌యోపిక్ స్టార్ అనే స్టాంప్ ప‌డుతోంది. ఇది మీ కెరీర్ కు మైన‌స్ అవుతుంద‌నే భ‌యం లేదా..? జ‌న‌ర‌ల్ గా స్టాంప్ ప‌డితే కెరీర్ కు మైన‌స్ అంటుంటారు క‌దా..!

శ్రీ తేజ్: లేదండి ..నేనేమి భ‌య ప‌డటం లేదు. వంగ‌వీటి చిత్రం..ఆ త‌రువాత క‌థానాయ‌కుడు..మ‌హానాయ‌కుడు , ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు అన్ని కూడా నాకు వ‌చ్చిన అవ‌కాశాల్ని నేను స‌ద్వినియోగం చేసుకుని న‌టుడిగా న‌న్ను నేను ప్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాను . నేను వ‌ర‌స‌గా చేయ‌డం వ‌ల‌న బ‌యోపిక్ చిత్రాల స్టార్ అంటున్నారు మీడియా వారు. వాస్త‌వంగా ఈ చిత్రాల‌కంటే ముందు నేను హీరోగా 3 చిత్రాలు చేశాను . అయితే అవి పెద్ద‌గా రీచ్ కాలేదు. అవి హిట్ అయ్యివుంటే న‌టుడిగా నాలో వేరియ‌షన్ ను అర్ధం చేసుకునే అవ‌కాశం ఇటు ద‌ర్శ‌కుల‌తో పాటు ఆడియ‌న్స్ కు వుండేది. అవి హిట్ కాక పోవ‌డం వ‌ల‌న .. వ‌ర‌స‌గా నేను ఈ చిత్రాలు చేసి వుండటం వ‌ల‌న శ్రీ‌తేజ్ అంటే ఇక ఇటువంటి చిత్రాలే చేస్తాడ‌మో అనుకుంటున్నారు . అయితే నేను మీడీయా ద్వారా ఒక విష‌యం ద‌ర్శ‌క లంద‌రీకి చెప్పానుకుంటున్నాను ..నేను ఏదోఒక స‌ర్కిల్ లో ఇమిడిపోవాల‌నుకోవ‌డం లేదండి. న‌టుడిగా నేను ఏ పాత్ర‌ను చేయ‌డానికైన సిద్దం . నాకు `ఆట‌గాళ్లు` చిత్రంలో ప‌రుచూరి ముర‌ళి గారు ఒక మాస్ రోల్ ఇచ్చారు. ఆయ‌న ఒక‌టే అన్నారు. నేను నీవు న‌టించిన సినిమాలు ఏవి చూడ‌లేదు. ఈ రోల్ బాగా చేస్తావా అని అడిగారు. చేయ‌గ‌ల‌ను సార్ అని కాన్ఫిడెంట్ గా చెప్పాను. (ఆడిష‌న్స్ కూడా చేయ‌లేదు నాకు) ఆ త‌రువాత నేనే స్వ‌యంగా కొన్ని మాస్ లోకేష‌న్స్ కు వెళ్లి ఒక ఫ్రెండ్ తో ఫోటోస్ తీపించి ..ఆ ఫోట‌ల‌తో ఒక మంచి వీడియో చేసి డైరెక్ట‌ర్ ముర‌ళీ గారికి పంపించాను. అవి చూసి ఆయ‌న ఎంతో ఇంప్రెస్ అయ్యారు. నీలో నిజంగా ఇంత వెర్స‌టాల‌టీ ఉందా అనే ఆశ్య‌ర్యం వ్య‌క్త ప‌ర‌చారు. సో.. న‌టుడిగా నేను ఏదైనా చేయ‌గ‌ల‌ను అనే నామ్మ‌కం నా మీద నాకు ఉంది.మెప్పించ‌గ‌ల‌ను అనే విశ్వాసం ఉంది. అలా అని ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఏమి లేదు సుమి .

 

ప్ర‌.15ఇక వంగ‌వీటి నుంచి ఇప్ప‌టి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వ‌ర‌కు మీకు ఎన్నో కాంప్లీమెంట్స్ వ‌చ్చి వుంటాయి. వాటిలో మీకు బాగా హ్యాపి అనిపించిన కాంప్లీమెంట్ ఏదైనా ఉందా..?

 

శ్రీ తేజ్: మ‌ర‌చిపోలేని కాంప్లీమెంట్స్ ఉన్నాయండి. వంగ‌వీటి సినిమా స‌మ‌యంలో డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ గారు ఒక ట్విట్ పెట్టారండీ. అదేమిటంటే..ఎంటైర్ యాక్టింగ్ క్రూ లో శ్రీ‌తేజ్ డిడ్ టెర్రిఫిక్ అని పెట్టారండి. ఆ కాంప్లీమెంట్ కు నాకు నందీ అవార్డు వ‌చ్చి ఇంట్లో ఉన్నంత ఆనందం క‌లిగింది. అలాగే వంగ‌వీటి సినిమా ప్రివ్యూ చూసిన త‌రువాత పూరీ జ‌గ‌న్నాధ్ గారు .. నీ క‌ళ్ల‌లో ఆ ఇంటెన్సీటి ఏంట‌య్యా..టెర్రిఫిక్ అన్నారు అది కూడా మ‌ర‌చిపోలేని కాంప్లీమెంట్ . అంత సెటిల్డ్ గా పెర్ ఫార్మ్ చేశావ‌ని ప్ర‌శంసించారు. ఇక ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో నా యాక్టింగ్ కు వ‌ర్మ గారు కాంప్లీమెంట్ ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేను. వ‌న్ మెన్ షో అన్నారండి. నేను ఎంచుకున్న క్రూలో శ్రీ‌తేజ్ ఒక బెస్ట్ అండ్ టాప్ అని మీడియాకు కూడా చెప్పారు. ఇది నాకు ఒక టానిక్ అండ్ ఎన‌ర్జీ డ్రింక్ లాంటి ప్ర‌శంస .ఇక మీడియా వారు కూడా…Heroic star Shritej .. Bio pic star.. Firday star ఇలా తెలుగు , ఇంగ్లీషు వార్త ప‌త్రిక‌ల్లోను.. వెబ్ మీడియాలో రాశారు.అలా ఎవ‌రికి ఏది అనిపిస్తే అది రాశారు. అన్ని కూడా నాకు పాజిటివ్ గా నే అనిపించాయి.

 

16. ఇక ఇది ఇంటర్నెట్ యుగం. సినిమాల‌కు రివ్యూలు రాసే వారు పెరిగారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెర‌గింది. మీ వ‌ర‌కు రివ్యూస్ మీద మీ అభిప్రాయం ఏమిటి..? అస‌లు రివ్యూస్ రాసే వాడి కి అర్హ‌త ఏమిటి అని గ‌తంలో వ‌ర్మ లాంటి వారు మండి ప‌డ్డ సంద‌ర్భం ఉంది..?

 

శ్రీ తేజ్: అది ఎవ‌రి అభిప్రాయం వారికి వుంటుంది అండి. నా వ‌ర‌కు నేను ఫ‌స్ట్ ఫిల్మ్ `నా సామి రంగ‌` చిత్రం లో ఈజ్ తో న‌టించ‌లేక పోయాను. అప్పుడు సెట్ లో నాకు వాతావ‌ర‌ణం అనుకులించ‌లేదు. దాంతో నేను కొంత రిజ‌ర్వడ్ గా..బిగ‌ప‌ట్టిన‌ట్లు న‌టించాను. ఆ విష‌యాన్ని రివ్యూస్ లో హైలెట్ చేశారు. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్ మ‌రియు స్నేహితులు కూడా అదే చెప్పారు. నిజంగా సమీక్ష‌కులు హైలెట్ చేసిన మైన‌స్ పాయింట్ ను నేను త‌రువాత స‌రిదిద్దుకున్నాను. వాళ్ల స‌రిగా చేయ‌లేదు అని రాశారు గానీ ..చేయ‌లేడు అని రాయ‌లేదు.ఫ‌స్ట్ టైమ్ చ‌దివిన‌ప్పుడు బాధ అనిపిస్తుంది కానీ అది నిజం . అది నేను రివ్యూస్ ను చూసిన కోణం…అంటే తేజు నెగిటివ్ లో కూడా పాజిటివ్ లు వెతుకునే మైండ్ సైడ్ అన్నమాట‌. .. నేను ప‌ర్టీక్యూల‌ర్ గా రివ్యూస్ మీది ఇది నా అభిప్రాయం అని చెప్పలేనండి.!

 

17. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చూసి మీ అమ్మ‌గారు ఏమ‌న్నారు..?

 

శ్రీ తేజ్: పంపించ‌మ‌న్న‌ప్పుడు నేను రెడీ అయ్యి పిక్స్ తీయించింది మా అమ్మ‌గారితోనే. అయితే ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు రోల్ కోసం అని మా అమ్మ‌కు తెలియ‌దు. మా అమ్మ‌గారికే కాదు నాకు త‌ప్ప ప్ర‌పంచంలో ఎవ‌రికి తెలియ‌దు. వ‌ర్మ గారు ప్ర‌చారం చేస్తారు. సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు మాకు ప‌రిమితులున్నాయి. అందుకే వ‌ర్మ గారు చంద్ర‌బాబు నాయుడు గెట‌ప్ లో వున్న నా ఫోటోను ట్విట్ చేసి …ఎవ‌రో తెలుసా అని ఒక వాక్యం రాసి పేరు రాయ‌కుండ వ‌దిలారు.దీంతో చాల మంది న‌న్ను అది నువ్వేనా ..చంద్ర‌బాబు రోల్ న‌వ్వే క‌దా అని అడిగారు. కానీ నేను ఏమి చెప్ప‌లేక పోయాను. ఎందుకంటే మాకు మా పాత్ర‌ల గురించి రిలీజ్ కు ముందు రివీల్ చేయ‌కూడ‌ద‌నే కండిష‌న్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ కొంచెం ఫీలు అయ్యి వుంటారు. త‌రువాత అర్దం చేసుకున్నారు.

 

ప్ర‌18.ఆర్టిస్ట్ అంటే డ్రీమ్ రోల్ ఏదో ఒక‌టి ఉంటుంది. మ‌రి మీ డ్రీమ్ రోల్ ఏంటి..అస‌లు ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా లేదా..?

 

శ్రీ తేజ్: అయ్యే చాల ఉన్నాయండి. ఒక్క‌టి కాదు… బ‌యోపిక్‌లే కాదు. స్పోర్ట్స్ బేస్డ్ కావోచ్చు.. పోలీస్ స్టోరి కావోచ్చు.. ఇప్ప‌టి స‌మ‌కాలీన జీవితానికి సంబంధించిన రాక్ స్టార్ లాంటి చిత్రాలు కావోచ్చు.. నేను జాన ప‌దాలు చేయ‌డానికి కూడ రెడీ అండి. అలా చాల ఉన్నాయండి డ్రీమ్ రోల్స్ .. ఒక్క‌టి అని కాదు మ‌రి..!

 

19. అస‌లు మీ నాన్న‌గారు మిమ్మ‌ల్ని ఏ జాబ్ లో చూడాల‌నుకున్నారు. పేరెంట్స్ కూడ కొన్ని అంచ‌నాలు ఆశ‌లు పిల్ల‌ల మీద ఉంటాయి క‌దా..!

 

శ్రీ తేజ్: అబ్బే ఇప్పుడు ఎందుకు లేండి. త‌రువాత చెబుతాను అన్నారు. ఇది చెప్ప‌డానికి కూడా ఎంద‌కు ప్రొబ్ల‌మ్ అన్న‌ట్లుగా నేను చూశాను. శ్రీ‌తేజ్ వెంట‌నే .. మా నాన్న‌గారు న‌న్ను పోలీస్ ఆఫీస‌ర్ గా చూడాల‌నుకున్నారు. నేను హైద‌రాబాద్ అందుకే వ‌చ్చాను. మార్ష‌ల్ ఆర్డ్స్ కూడా నేను స్టూడెంట్ గా ఉన్న‌ప్పుడే నేర్చుకున్నాను. స్పోర్ట్స్ అన్ని ఆడ‌తాను. వాలిబాల్.. హ్యాండ్ బాల్..క్రికెట్ ..ఒక్క‌టి కాదండి..!ఆల్ రౌండ‌ర్ లా రెడీ అయ్యాను. పోలీస్ యాంబిష‌న్ నుంచి సినిమా యాక్ట‌ర్ గా యు ట‌ర్న్ తీసుకున్నాను.

 

 

20. ఇక ప్ర‌స్తుతం రెండు రాష్ఱ్రాల్లోను ఎల‌క్ష‌న్స్ ముగిసాయి. ఏపీలో అయితే రిజ‌ల్ట్ కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. మ‌రి ఏపీ లో ఏ పార్టీ గెల‌వొచ్చు .. ఎనీ ప్రిడిక్ష‌న్స్ అని అడిగితే..!

 

శ్రీ తేజ్: శ్రీ‌తేజ్ ఎందుకు వ‌చ్చిన గొడవ అనుకుని.. పాలిటిక్స్ గురించి ఒక్క‌ మాట మాట్లాడ‌కుండ‌.. నాకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో కూడా రిలీజ్ అయి సూప‌ర్ హిట్ అయ్యి మ‌రిన్నిమంచి క్యారెక్ట‌ర్స్ రావాల‌ని కోరుకుంటున్నాను అంటూ న‌వ్వుతు ఎవాయిడ్ చేశారు… నేను అస‌లు రాజ‌కీయాల గురించి పెద్ద‌గా ఆలోచించ‌ను ..దృష్టి పెట్ట‌ను.. ఇక న‌న్ను పాలిటిక్స్ గురించి అడిగిన ఉప‌యోగం ఉండ‌దు అన్న‌ట్లు స్మార్ట్ గా చెప్పారు..!

21. మీ ఆల్ టైమ్ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు !.

శ్రీ తేజ్:  ఒక్క‌రు అని చెప్ప‌ను . ఎందుకంటే ఒక్కో హీరోకు ఒక్కో క‌ష్టం క‌నిప‌స్తది. కాబ‌ట్టి నాకు అంద‌రు ఇష్ట‌మే. నందమూరి తారక రామారావు గారు, చిరంజీవి గారు, రవితేజ గారు… ఇష్టం. ఇక బ్యాగ్రండ్ తో వ‌చ్చిన వాళ్లు ఎంతో క‌ష్ట ప‌డుతుంటారు. వాళ్లే అంత‌గా క‌ష్ట‌ప‌డితే మా లాంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్లు ఇంకెంత హార్డ్ వ‌ర్క్ చేయాలో అని నేను అనుకుంటాను.

22. తెలుగులో మీ ఆల్ టైమ్ ఫేవ‌రేట్ సినిమా..?

మాయాబ‌జార్ …

బాగా ఇష్ట‌మైన చిత్రాలు

పాతాళ‌భైర‌వి, చంటాబ్బాయ్ , జంబ‌ల‌కిడిపంబా.. కామెడి కూడా బాగా ఇష్టం. రాజేంద్ర ప్ర‌సాద్ గారు న‌టించిన అన్ని చిత్రాలు చూసే వాడిని…రాజేంద్రుడు గ‌జేంద్రుడు .. అలీబాబ అర‌డ‌జ‌ను దొంగ‌లు అస‌లు మిస్ కాలేదు.

 

23. క‌నీసం ఆల్ టైమ్ ఫేవ‌రేట్ హీరోయిన్ పేరు అయిన చెప్పండి ఒక్క‌రి పేరు అంటే..!

 

శ్రీ తేజ్: ఒక్క‌రి పేరు చెప్పి నేను ఆగ‌లేనండి. మ‌హాన‌టి సావిత్రి గారు ..వాణిశ్రీ గారు.. భానుమ‌తి గారు ఇలా వాళ్ల జ‌న‌రేష‌న్ లో వాళ్లు అంత స‌హ‌జంగా న‌టించ‌డానికి ఏం హోం వ‌ర్క్ చేశారో అని ఆలోచ‌న చేస్తుంటాను. అలాగే సౌంద‌ర్య గారు. .మ‌న‌కు తెలిసిన గొప్ప న‌టి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ లో స‌మంత గారు.. ఇలా కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఆడియ‌న్స్ ను అల‌రించిన న‌టీమ‌ణులు అంద‌రు నాకు గుర్తోస్తారండి. ఇప్పుడు మ‌నం కూర్చున్న గ‌దిని డెక‌రేట్ చేసుకోమంటే. మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రికి చెందిన అంద‌రి ఫోటోలు పెడ‌తాను .. ఏదైనా సినిమాకు సంబంధించి ఒక్క‌టి అనే ద‌గ్గ‌ర నేను ఆగ‌లేను .. ఎందుకంటే సినిమా గొప్ప‌త‌నం అది అంటాను.

 

24. ఇక ద‌ర్శ‌కుల విష‌యంలో ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అని ..డ్రీమ్ డైరెక్ట‌ర్ అని ఎవ‌రైనా వున్నారా..? వ‌ర్మ గారిని ఈ విభాగం నుంచి తీసేద్దాం. ఆయ‌న స‌ప‌రేటు మైండ్ పోలిక‌ల‌కు అందే మైండ్ కాదు క‌దా!

శ్రీ తేజ్: అవునండి రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుల సినిమాల్లో వ‌ర్క్ చేయాల‌ని ప్ర‌తి ఆర్టిస్ట్ కు వుంటుంది. అయితే ద‌ర్శ‌కుల‌కు వాళ్ల పాత్ర‌ల‌కు ఎవ‌రు కావాలో వాళ్ల‌నే ఎంపిక చేసుకుంటారు. బాహుబ‌లి తో మ‌న తెలుగు సినిమా గురించి ప్ర‌పంచం అంత మాట్లాడుకునే లా చేశాడు రాజ‌మౌళి గారు.. ఆ త‌రువాత వివి వినాయక్ గారు సుకుమార్ గారు .. క్రిష్ గారు … పూరి జ‌గన్నాధ్ గారు.. ప‌రుచూరి ముర‌ళి గారు అనే కాదు ఏ ద‌ర్శ‌కుడితో అయిన నేను ప‌ని చేస్తాను. గుణ శేఖ‌ర్ గారు కూడా మంచి ద‌ర్శ‌కులు. ఎవ‌రెంత ప్యాష‌న్ తో క్రియేటివ్ గా చేస్తారో వాళ్ల‌ను అంత పిక్స్ కు సినిమా తీసుకెళ్తుంద‌ని నేను న‌మ్ముతాను. ఆర్టిస్టులు డిడికేష‌న్ తో వుంటే ద‌ర్శ‌కుల‌కు క‌చ్చితంగా రీచ్ అవుతామ‌నే న‌మ్మ‌కం ఉంది.

25. ఇక ద‌ర్శ‌క జీనియ‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గారితో మీకు వున్న అనుబంధాన్ని మీ అభిమానుల‌తో షేర్ చేసుకుంటారా..? శ్రీ‌తేజ్ అనే ఆర్టిస్ట్ ప్రేక్ష‌కుల‌కు రీచ్ కావ‌డం వ‌ర్మ గారి వ‌ల‌నే అని చెప్ప‌డం వ‌ల‌న మీకు ఏమి అభ్యంత‌రం లేదు క‌దా!.?

 

శ్రీ తేజ్: ఏమి అభ్యంత‌రం లేదండి. మీరు వంగ‌వీటి సినిమా ఆడియో రిలీజ్ చూశారా. అప్పుడు నేను వేదిక మీద‌కు వ‌చ్చిన మ‌రుక్ష‌ణం .. గురు బ్ర‌హ్మ‌.. గురు విష్ణు.. గురుదేవో మ‌హేశ్వ‌రా..గురు సాక్షాత్ ప‌ర‌బ్ర‌హ్మ త‌స్మై శ్రీ గుర‌వే న‌మః అని చెప్పాను. నా త‌ల్లి దండ్రుల త‌రువాత న‌న్ను న‌టుడిగా జీవితం ఇచ్చింది ఆర్జీవినే..నేను చెప్పిన ఈ మాట‌ల వీడియోను క‌ట్ చేసి నేను వ‌ర్మ గారికి పంపాను. అది ఆయ‌న ట్విట‌ర్ లో కూడా పెట్టారు. ఆర్జీవి గారి గురించి నేను ఎంత చెప్పిన త‌క్కువే నండి. ఆయ‌న నా గురువు గాడ్ ఫాద‌ర్ అని చెప్ప‌డం గ‌ర్వం సంతోషం అన్ని ఫీల్ అవుతాను. ఒక‌సారి ట్విట‌ర్ లో నాది ఒక పిక్ పెట్టి యుగానికి ఒక్క‌డు అని రాశారు..ఇంకేమి చెప్పాలి.. మాట‌ల్లేవ్..! న‌టులుగా నాలో ఎంత టాలెట్ అయిన ఉండోచ్చు అండి. అది ఎలివేట్ కావాలంటే స‌రైన ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డాలి. వాళ్లు అవ‌కాశం ఇవ్వాలి. అలా నాలో న‌టుడు ఎలివేట్ అయ్యే అవ‌కాశం రామ్ గోపాల్ వ‌ర్మ ద్వారా నాకు ద‌క్కింది. ఏ న‌టుడికైన ద‌ర్శ‌కుడు ..ప్రొడ్యూస‌ర్లు చాల ముఖ్యం అని నేను బాగా న‌మ్ముతాను.

 

26.మ‌రి ఫ్యూచ‌ర్ లో మెగాఫోన్ ప‌ట్టే అవ‌కాశం ఉందా..!

శ్రీ తేజ్: అమాయ‌కంగా…మెగాపోన్ అంటే ఎంటండి అన్నారు. డైరెక్ష‌న్ అన‌గానే అవునా అన్న‌ట్లు న‌వ్వేశారు. అబ్బే లేనే లేదండి. ఆర్టిస్టుగానే నేనే చేయాల్సింది చాలా ఉంది. ఎప్ప‌టికి నేను న‌లుడిగానే కొన సాగుతాను. డైరెక్ష‌న్ పై ఆస‌క్తి లేదు.న‌టుడిగా నాకంటు ఒక గుర్తింపు .. యాక్టింగ్ ప‌రంగా ఒక స్టాంప్ క్రియేట్ చేయాలి.

 

27. అస‌లు ముఖ్య‌మైన ప్ర‌శ్న ఒకటి ఇప్ప‌టి వ‌ర‌కు అడ‌గ‌లేదండి.. అడ‌గండి అన్నారు. చంద్ర‌బాబు రోల్ ను రానా గారు చేశారు. మీరు చేశారు. అయితే ప్రేక్ష‌కులు మీరు పోషించిన రోల్ బావుందున్నారు. మ‌రి మీరేమంటారు!.

 

శ్రీ తేజ్: రానా గారు మ‌హానాయ‌కుడిలో పోషించిన చంద్ర‌బాబు పాత్ర 1970 నుంచి 1989 వ‌ర‌కు వుండే చంద్ర‌బాబు గారు . స్క్రిప్ట్ మేర‌కు ఆయ‌న బాగా చేశార‌ని నా ఫీలింగ్. అలాగే 1989 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వున్న చంద్ర‌బాబు గారి పాత్ర‌ను నేను చేశాను. ఇద్ద‌రం స్క్రిప్ట్ ప్ర‌కారం చేశాం. రాణ గారు బాహుబ‌లి తో అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు. అది నాకు తెలుసు.ప్రేక్ష‌కులు ఎలా అనుకున్న‌ప్ప‌టికి నేను మాత్రం ఈ విష‌యంలో నేను ఏదో రాణ‌ గారికంటే గొప్ప‌గా చేసేశాను అని భావించ‌డం లేదండి.!

 

27. ఇక చివరిగా ఏమిటంటే..! మీ లైఫ్ ను డ్రైవ్ చేసే అంశం ఎలిమెంట్ ఏమిటి?

 

శ్రీ తేజ్: ఆల్ ఈజ్ వెల్ అండి. మంచి జ‌రిగినా..చేడు జ‌రిగినా ముందుకెళ్ల‌గ‌ల‌గాలి. చెడు జరిగింది క‌దా అని ఇక్క‌డే కూర్చొండి పోతే లైఫ్ ఆగిపోది క‌దా..! అందుకే ఏది జ‌రిగిన మ‌న మంచికే…నేను బుక్స్ ఎక్కువ చ‌ద‌వును కానీ.. స్వామి వివేకానంద కొటేష‌న్స్ బాగా చ‌దువుతాను . అవి నాకు ఎంతో ప్రేర‌ణ ఇస్తుంటాయి.

 

మ‌రి మీ రాబోయో చిత్రాలు ఏమిటి..

 

శ్రీ తేజ్: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ముందు `అక్ష‌ర` అనే ఒక చిత్రం ప్రారంభం అయ్యింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చేయ‌డం వ‌ల‌న ఆగిపోయింది. ఇప్పుడు ఆ చిత్రం పూర్తి చేసే ప‌నిలో వున్నాను.

ధ‌న్య‌వాదాలు చెప్పి ఇంట‌ర్వూ ముగించాను.

మ‌రి శ్రీ తేజ్ గారితో మాట్లాడిన త‌రువాత‌..ఆయ‌న‌లో ఒక బ‌ల‌మైన పాజిటివ్ థింక‌ర్.. ప్యాష‌నేట్ ఆర్టిస్ట్.. మంచి మ‌నీ మేనేజ‌ర్ .. బ్యూటీఫుల్ మైండ్ వుంద‌నిపించింది.

మ‌రి మీకు..!

వెంక‌ట్ బి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*