నంద్యాల ఎంపీ ఎస్‌పివై రెడ్డి కన్నుమూత

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్‌పివై రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ మూడు నుంచి బంజారాహిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు.

69 సంవత్సరాల ఎస్‌పివై రెడ్డి 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఇటీవలే ఆయన జనసేనలో చేరారు. జనసేన తరపున నంద్యాల ఎంపీగా పోటీ చేశారు.

పెద్ద ఎరికల్ రెడ్డిగా పేరున్న ఎస్‌పీవై రెడ్డి 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. నంది పైపులతో ప్రసిద్ధిగాంచారు. నంద్యాలలో ఉచితంగా బోర్లు వేయించారు. రూపాయికే రొట్టె-పప్పు పథకం ప్రవేశపెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*