సూపర్ ఓవర్‌లో హైదరాబాద్‌ను ఓడించిన ముంబై

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుపై విజయం సాధించింది. మ్యాచ్‌ టై‌గా ముగియడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ జట్టు 8 పరుగులు చేయగా ముంబై జట్టు మూడు బంతుల్లో 9 పరుగులు సాధించి మ్యాచ్ గెలిచింది.

అంతకు ముందు ముంబై జట్టులో రోహిత్ 24, సూర్యకుమార్ 23, లివీస్ 1, హార్థిక్ పాండ్యా 18, డికాక్ 69 పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

హైదరాబాద్ జట్టులో సాహ 25, గుప్టిల్ 15, పాండే 71, విలియమ్సన్ 3, శంకర్ 12, మహ్మద్ నబీ 31 పరుగులు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*