మెరిసిన ముంబై… ముగిసిన కోల్‌కతా కథ

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. గిల్ 9, లిన్ 41, దినేశ్ కార్తీక్ 3, నితీశ్ రానా 26 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మలింగా మూడు, హార్థిక్, బుమ్రా చెరి రెండు వికెట్లు తీశారు.

134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 16.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 55, యాదవ్ 46, డి కాక్ 30 పరుగులు చేశారు.

తాజా విజయంతో 18 పాయింట్లతో ముంబై టాప్ ప్లేస్‌కు చేరింది. అదే సమయంలో కోల్‌కతా కథ ముగిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*