కేరళకు కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ వెళ్లనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు తిరువనంతపురంలో కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సమావేశమౌతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతారు. ఆ తర్వాత కేసీఆర్ రామేశ్వరం, శ్రీరంగం ఆలయాలను సందర్శిస్తారు.

 

విజయన్ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులూ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియనున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేసీఆర్ గతంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ తదితరులతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ నెంబర్ రాకుంటే చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*