విజయన్‌తో కేసీఆర్ భేటీ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు

తిరువనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేరళ తిరువనంతపురంలో ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు సీఎంలూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్లమెంట్ ఐదో విడత ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కేసీఆర్ విజయన్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ గతంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ తదితరులతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*