ఐపీఎల్ 12 ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ ఫైనల్‌కు ముంబై ఇండియన్స్ దూసుకెళ్లింది. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్‌ 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‎కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‎ విజయ్ 26, రాయుడు 42, ధోని 37 పరుగులు చేశారు. 20 ఓవర్లలో చెన్నై 4 వికెట్లను కోల్పోయి 131 పరుగులు చేసింది.

132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. ముంబై బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 4, డికాక్ 8, సూర్యకుమార్ యాదవ్ 70 నాటౌట్, కిషన్ 28, పాండ్యా 13 పరుగులు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*