ఇంటి ముఖం పట్టిన ఢిల్లీ.. ఫైనల్‌కు చేరిన చెన్నై

వైజాగ్: వైజాగ్‌లో జరిగిన టీ20 ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఢిల్లీ కేపిటల్స్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో పృథ్వీషా (5), శిఖర్ ధవన్ (18), రిషభ్ పంత్ 38, కోలిన్ మన్రో 27, ఇషాంత్ శర్మ పది పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో చాహర్, హర్భజన్ సింగ్, జడేజా, బ్రావో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టాడు.

చెన్నై ఆటగాళ్లలో డు ప్లెసిస్ 50, వాట్సన్ 50, రైనా 11, రాయుడు 20, ధోనీ 9, బ్రావో 4 పరుగులు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*