ఐపీఎల్ ఫైనల్ విజేత ఎవరంటే?

హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.

 

ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 150 పరుగుల విజయలక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించలేకపోయింది. చివరి బంతిలో రెండు పరుగులు సాధించాల్సి ఉండగా మలింగ బౌలింగ్‌లో ఠాకూర్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు.

 

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌లో డుప్లెసిస్ 26, రైనా 8, రాయుడు 1, ధోనీ 2, వాట్సన్ 80, బ్రావో 15 పరుగులు చేశారు.

 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. డికాక్ 29, రోహిత్ శర్మ 15, సూర్యకుమార్ 15, కృనాల్ పాండ్యా 7, కిషన్ 23 హార్థిక్ పాండ్యా 16, పొలార్డ్ 41 పరుగులు చేశారు. దీంతో చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3, శార్దూల్, తాహీర్ చెరో వికెట్ తీశారు.

 

ఫైనల్ విజేతకు 20 కోట్ల రూపాయలు, రన్నరప్‌కు 12.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*