జగన్ సీఎంగానే తిరిగి హైదరాబాద్‌కు వస్తారట!

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్‌ను పెంచాయి. ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సీఎం కావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఈసారి సీఎం కావడం పక్కా అని జగన్ కూడా మునుపెన్నడూ లేనంత ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు జగన్ అమరావతి చేరుకున్నారు. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చి ఆ పార్టీ విజయం సాధిస్తే ఇక మిగిలేది ప్రమాణ స్వీకారం ఒక్కటే.

బుధవారం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన జగన్ తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే మళ్లీ హైదరాబాద్ వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే జగన్ నేరుగా ఇడుపులపాయ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు.

అనంతరం ఆ లేఖను గవర్నర్‌కు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ వైసీపీ నేతలు కోరుతారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం హోదాలోనే జగన్ తిరిగి హైదరాబాద్‌లో కాలుపుమోపుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి వారి ఆశలు నిజమవుతాయో? లేదో? చూడాలంటే మరికొన్ని ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*