ఏపీని స్వీప్ చేసిన వైసీపీ.. సీఎంగా 30న ప్రమాణం చేయనున్న జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. గట్టిపోటీ ఇస్తుందనుకున్న టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అనేకచోట్ల మంత్రులు కూడా ఓటమిపాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం.

Posted by YS Jagan Mohan Reddy on Wednesday, May 22, 2019

అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ వైపీపీ సత్తాచాటింది. మొత్తం 22 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి సోషల్ మీడియా లక్ష్యంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీని సమాధి చేశారంటూ ఎద్దేవా చేశారు.

 

 

 

ఊహించినదానికన్నా ఎక్కువ సీట్లు రావడంతో వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*