నా ప్రమాణ స్వీకారానికి రండి: మోదీని ఆహ్వానించిన జగన్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి తదితరులు వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా తాను చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని జగన్ మోదీని ఆహ్వానించారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ ఏపీ సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలోని హామీలను త్వరగా నెరవేర్చాలని జగన్ కోరారు.

రెండవసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోదీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశామని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీల పై భేటీలో చర్చించామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధానిని కోరామంటూ ట్వీట్ చేశారు.

మోదీని కలిసిన బృందంలో విజయసాయిరెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

 

మోదీతో భేటీ అనంతరం జగన్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*