కృష్ణ భక్తిని చాటిన కనకదాసు నాటకం..

హైదరాబాద్: రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు కనకదాసు నాటకం ప్రదర్శించారు. శ్రీకృష్ణ భక్తిని చాటి చెప్పే ఈ నాటకాన్ని జర్నలిస్ట్ నారాయణ రావు రచించారు.

కన్నడనాట 500 వందల ఏళ్ల క్రితం జీవించిన కవి, సంగీతకారుడు, స్వరకర్త, సాధువు అయిన కనకదాసు జీవిత చరిత్ర ఆధారంగా ఈ నాటకం రూపొందించారు. శ్రీకృష్ణ భక్తుడైన కనకదాసుకు ఉడిపి కృష్ణ మందిరంలోకి అనుమతి లభించదు. స్థానికంగా ఉండే భక్తులు కనకదాసును మందిరంలోకి అనుమతించరు. తక్కువ కులం వాడంటూ అవమానించడమే కాకుండా చేయి కూడా చేసుకుంటారు. దీంతో కనకదాసు ఆలయానికి బయట వెనుక భాగంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత ఒకనొక రోజు శ్రీ కృష్ణుడి విగ్రహం కనకదాసు ఉన్నవైపు మళ్లుతుంది. అంతేకాదు ఆలయ గోడ బద్దలై కిటికీ గుండా కనకదాసుకు శ్రీకృష్ణ దర్శన భాగ్యం కలుగుతుంది.

కనకదాసుగా భరత్, శ్రీకృష్ణుడిగా మాధవ్ నటించారు. క్రాంతి భూషణ్, సంజయ్, రిషభ్, నిరంజన్, అభిరథ్, నిపుణ్, సంకర్షణ తదితరులు నటించారు. విద్యార్ధులకు తర్పీదునివ్వడంలో కమ్యూనికేషన్స్ ఫ్యాకల్టీ అజిత్ సింగ్, వాలంటీర్ ప్రణీత్ సాగర్ సహకరించారు.

యోగా మాస్టర్ లివాంకర్ నేతృత్వంలో విద్యార్ధులు యోగా ప్రదర్శనలు చేశారు.

మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*