పీఎంఓ నుంచి కాల్స్ వచ్చింది వీరికే

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణం చేయనున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌, బాబూలాల్ సుప్రియో, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిషన్ రెడ్డి తదితరులకు ఇప్పటికే పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజ్‌నాథ్, గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, స్మృతీ ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌లకు ఇప్పటికే బెర్త్‌లు ఖరారైనట్లేనని సమాచారం.

మొత్తం 70 మంది ప్రమాణం చేయనున్నారని సమాచారం. మరోవైపు శాఖల కేటాయింపులపై మోదీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు సార్లు భేటీ అయ్యారు. వేర్వేరుగా ఎనిమిదిన్నర గంటలు చర్చలు జరిపారు. ప్రధానితో షా, రాజ్‌నాథ్ సమావేశమై చర్చలు జరిపారు. అనారోగ్య కారణాల వల్ల తాను మంత్రి పదవి స్వీకరించలేనన్న జైట్లీని సముదాయించేందుకు మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. జైట్లీ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో మంత్రివర్గంలో ఆమె ఉండకపోవచ్చని సమాచారం. కేంద్ర మంత్రి వర్గంలోకి అమిత్ షా ను తీసుకునే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*