మోదీ ప్రమాణానికి మమత, స్టాలిన్ డుమ్మా… జగన్ ప్రమాణానికి రాలేనన్న బాబు

న్యూఢిల్లీ: ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ చేయబోయే ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టబోతున్నారు. తొలుత హాజరవ్వాలని ఆమె నిర్ణయించుకున్నా పశ్చిమబెంగాల్‌లో హింస కారణంగా మరణించిన వారి కుటుంబీకులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలవడంతో మమత కినుక వహించారు. ప్రమాణ స్వీకారానికి రాలేనన్నారు. మరోవైపు యూపిఏ చెయిర్ పర్సన్ సోనియా గాంధీ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాహుల్ హాజరౌతారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కేరళ సీఎం పినరాయి విజయన్, డీఎంకే అధినేత స్టాలిన్ కూడా మోదీ ప్రమాణానికి హాజరుకావడం లేదు.

ఇటు అదేరోజు విజయవాడలో మధ్యాహ్నం జరిగే జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కారాదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరౌతున్నారు. ఆ తర్వాత జగన్, కేసీఆర్ కలిసి ఒకే విమానంలో న్యూఢిల్లీ వెళతారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరౌతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*