ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ప్రమాణం… హాజరైన కేసీఆర్, స్టాలిన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ పాల్గొన్నారు. అశేష జనవాహిని సమక్షంలో వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జగన్ తొలి సంతకం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం దశల వారిగా వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని ప్రస్తుతం 2250 రూపాయలకు పెంచుతున్నామని జగన్ ప్రకటించారు. నాలుగు లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమిస్తున్నామన్నారు. గ్రామవాలంటీర్ల జీతం నెలకు ఐదువేల రూపాయలుంటుందని జగన్ ప్రకటించారు. విద్యుత్‌ను తక్కువ ధరకు తెచ్చేలా కృషి చేస్తామన్నారు.

కొన్ని మీడియా సంస్థలు వార్తలను వక్రీకరిస్తున్నాయని, చంద్రబాబు తప్ప మరెవ్వరినీ సీఎంగా చూసేందుకు ఆయా మీడియా సంస్థలు ఇష్టపడటం లేదని జగన్ చెప్పారు.

తమిళనాడు సీఎంగా స్టాలిన్ త్వరలో ప్రమాణం చేయాలని ఆకాంక్షిస్తున్నానని జగన్ చెప్పారు.

అంతకు ముందు మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుండాలని సూచించారు. కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*