ప్రమాణం చేసిన గంటల్లోనే పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంటల్లోనే పలువురు ఐపీఎస్‌లను జగన్ బదిలీ చేశారు. కొత్త డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. గౌతం సవాంగ్ మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా వ్యవహరించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చురుగ్గా పనిచేశారు. సీఆర్‌పీఎఫ్‌లోనూ పనిచేశారు. రెండు సార్లు రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నారు.

మరోవైపు పాత డీజీపీ ఆర్పీ ఠాకూర్‌‌ను జగన్ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కూడా బదిలీ అయ్యారు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలందాయి. ఏసీబీ డీజీగా విశ్వజిత్‌కు పూర్తిస్థాయి బాధ్యతలిచ్చారు. ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీగా ఎస్‌ఎస్‌ రావత్‌ నియమితులయ్యారు. రావత్‌కు సాంఘీక సంక్షేమశాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎం కార్యదర్శిగా సాల్మన్‌ ఆరోక్యరాజు నియమితులయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*