కొలువుతీరిన మోదీ కేబినెట్..

న్యూఢిల్లీ: మోదీ కేబినెట్ కొలువు తీరింది. 58మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 25మంది కేబినెట్ మంత్రులుగా, 9మంది స్వతంత్ర మంత్రులుగా, 24మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

మోదీ మంత్రుల జాబితా ఇదే!

1. న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ ( వారణాసి – ఉత్తరప్రదేశ్ )

2. రాజ్‌నాథ్ సింగ్‌ ( ఉత్తరప్రదేశ్ – లక్నో )

3. అమిత్ అనిల్ చంద్ర షా ( గుజరాత్ – గాంధీనగర్ )

4. నితిన్ జైరామ్ గ‌డ్క‌రీ( మ‌హారాష్ట్ర‌ )

5. స‌దానంద గౌడ‌( కర్ణాటక )

6. నిర్మలా సీతారామన్ (రాజ్యసభ – కర్ణాటక )

7. రామ్ విలాస్ పాశ్వాన్ ( బీహార్ – లోక్ జన్ శక్తి పార్టీ )

8. నరేంద్ర సింగ్ తోమర్ ( మధ్యప్రదేశ్ )

9. రవిశంకర్ ప్రసాద్ ( బీహార్ )

10. హరిసిమ్రత్ కౌర్ బాదల్ ( పంజాబ్ )

11. థావర్ చంద్ గెహ్లాట్ ( రాజ్యసభ – మధ్యప్రదేశ్ )

12. డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్ ( ఐఎఫ్‌ఎస్ – పద్మశ్రీ గ్రహీత – దౌత్యవేత్త )

13. డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిశాంక్ ( ఉత్తరాఖండ్ )

14. అర్జున్ ముండా ( జార్ఖండ్ )

15. స్మృతి జుబేద్ ఇరానీ ( అమేథీ – ఉత్తరప్రదేశ్ )

16. డాక్టర్ హర్షవర్థన్ ( ఢిల్లీ )

17. ప్రకాష్ కేశవ్ జవడేకర్ ( మహారాష్ట్ర )

18. పీయూష్ జయప్రకాష్ గోయల్ ( మహారాష్ట్ర )

19. ధర్మేంద్ర ప్రదాన్ ( ఒడిశా )

20. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( ఉత్తరప్రదేశ్ )

21. ప్రహ్లాద్ జోషి ( కర్ణాటక )

22. మహేంద్రనాథ్ పాండే ( ఉత్తరప్రదేశ్ )

23. అరవింద్ గణపత్ సావంత్ ( మహారాష్ట్ర – శివసేన )

24. గిరిరాజ్ సింగ్ ( బీహార్ )

25. గజేంద్ర సింగ్ షెకావత్ ( రాజస్థాన్ )

 

కేంద్ర స్వతంత్ర హోదా మంత్రులు

 

26. సంతోష్ గంగ్వార్ ( ఉత్తరప్రదేశ్ )

27. రావ్ ఇంద్రజిత్ సింగ్ ( హర్యానా )

28. శ్రీపథ్ నాయక్ ( గోవా )

29. కెప్టెన్ జితేంద్ర సింగ్ ( జమ్మూ )

30. కిరణ్ రిజుజు ( అరుణాచల్ ప్రదేశ్ )

31. ప్రహ్లాద్ సింగ్ పటేల్ ( మధ్యప్రదేశ్ )

32. రాజ్ కుమార్ సింగ్ ( బీహార్ )

33. హర్దీప్ సింగ్ పూరి ( రాజ్యసభ – ఉత్తరప్రదేశ్ )

34. మన్సూక్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ ( రాజ్యసభ – గుజరాత్ )

 

కేంద్ర సహాయమంత్రులు

 

35. అశ్వినీ కుమార్ చౌబే ( బీహార్ – బక్సర్ )

36. అర్జున్ రామ్ మేఘవాల్ ( రాజస్థాన్ )

37. జనరల్ వి.కె సింగ్ ( ఉత్తరప్రదేశ్ – ఘజియాబాద్ )

38. కృష్ణ పాల్ గుజ్జర్ ( ఫరీదాబాద్-హర్యానా )

39. దాన్వే దాదారావ్ పటేల్ ( మహారాష్ట్ర )

40. కిషన్ రెడ్డి ( సికింద్రాబాద్ – తెలంగాణా )

41. పురుషోత్తం రూపాల ( రాజ్యసభ-గుజరాత్ )

42. రామ్‌దాస్ అథవాలే ( రాజ్యసభ-మహారాష్ట్ర – రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా)

43. సాధ్వి నిరంజన్ జ్యోతి ( హమీర్‌పూర్-ఉత్తరప్రదేశ్ )

44. బాబుల్ సుప్రియో ( ఉత్తరపర-పశ్చిమ బెంగాల్

45. డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ ( ముజఫర్ నగర్ – ఉత్తరప్రదేశ్ )

46. ధోత్రె సంజయ్ షమ్రావ్ ( అకోలా – మహారాష్ట్ర )

47. అనురాగ్ సింగ్ ఠాకూర్ ( హమీర్ పూర్ – హిమాచల్ ప్రదేశ్ )

48. అంగడి సురేష్ చన్నబసప్ప ( బెల్గాం – కర్ణాటక )

49. నిత్యానంద్ రాయ్ ( ఉజియార్ పూర్ – బీహార్ )

50. రత్తన్ లాల్ కటారియా ( అంబాలా – హర్యానా )

51. వి. మురళీధరన్ ( రాజ్యసభ – కేరళ )

52. రేణుకా సింగ్ సరుట ( ఛత్తీస్‌గఢ్ )

53. సోమ్ ప్రకాష్ ( హోషియార్‌పూర్-పంజాబ్ )

54. రామేశ్వర్ టేలి ( అస్సాం )

55. ప్రతాప్ చంద్ర సారంగి ( ఒడిశా )

56. కైలాష్ చౌధరి ( బార్మర్ – రాజస్థాన్ )

57. శ్రీమతి దేబాశ్రీ చౌధురి ( పశ్చిమ బెంగాల్ )

58. ఫగ్గన్ సింగ్ కులస్తే ( మధ్యప్రదేశ్ )

ఉత్తరప్రదేశ్ – 6+2+3, మహారాష్ట్ర 4+1+1, బీహార్ 3+1+2, కర్ణాటక 3+1, మధ్యప్రదేశ్ – 1+1+1, గుజరాత్ – 1+1+1, హర్యానా +1+1, గోవా – 1, ఢిల్లీ – 1, జమ్మూ +1, ఒడిశా – 1+1, రాజస్థాన్ – 1+1+1, జార్ఖండ్ – 1, ఉత్తరాఖండ్ -1, పంజాబ్ – 1+1+1, అరుణాచల్ ప్రదేశ్ + 1, పశ్చిమ బెంగాల్ +2, హిమాచల్ ప్రదేశ్ +1, కేరళ+1, ఛత్తీస్‌గఢ్ +1, తెలంగాణా +1, అస్సాం +1

( + అంటే అర్థం స్వతంత్ర హోదా, రెండో ప్లస్ అంటే సహాయ మంత్రులు )

డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్ ( ఐఎఫ్‌ఎస్ – పద్మశ్రీ గ్రహీత – దౌత్యవేత్త – సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర మంత్రి పదవికి ఎన్నికైన వ్యక్తి )

కేబినెట్ – 25, స్వతంత్ర హోదా – 9 మందికి, సహాయ మంత్రులు – 24మంది… మొత్తం 58 మంది

కేబినెట్‌లో సుష్మాస్వరాజ్‌, మేనకాగాంధీ, ఉమాభారతికి చోటు దక్కలేదు.

75 ఏళ్లు దాటిన కారణంగా రాధామోహన్‌సింగ్, బీరేంద్రసింగ్‌ను దూరంగా ఉంచారు. అనారోగ్య కారణాలతో అరుణ్‌జైట్లీ కేంద్రమంత్రి పదవి చేపట్టలేదు.

మోదీ ప్రమాణస్వీకారానికి సినీ తారలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదాని, రతన్‌ టాటా, అజయ్‌ పిరమల్‌, క్రీడాకారులు పీటీ ఉష, రాహుల్ ద్రవిడ్‌, అనిల్ కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్‌, హర్బజన్‌, సైనా, పుల్లెల గోపీచంద్, దీపా కర్మాకర్, కంగనారనౌత్‌, షారూక్‌ఖాన్‌, సంజయ్‌లీలా బన్సాలీ, కరణ్‌ జోహార్‌, రజనీకాంత్ హాజరయ్యారు.

అయితే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా ప్రభుత్వంలో చేరేందుకు జేడీయూ నిరాకరించింది. బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ బీహార్‌ను స్వీప్ చేసింది. అయినా కూడా కేబినెట్‌లో చేరేందుకు ఆసక్తి కనపరచలేదు. అమిత్ షా స్వయంగా జేడీయూ అధినేత, బీహార్ సీఎం అయిన నితీశ్‌తో సమావేశమై కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఆయన ప్రభుత్వంలో చేరబోమన్నారు. కానీ బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతుందని, కలిసి పనిచేస్తామన్నారు. మంత్రి పదవుల కన్నా రాబోయే రోజుల్లో కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలతో తమ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందేమో అని జేడీయూ అనుమానిస్తోంది. ట్రిపుల్ తలాక్, రామాలయ నిర్మాణం వంటి నిర్ణయాల వల్ల జేడీయూకు ముస్లింల ఓట్లు దూరమౌతుందేమోనని నితీశ్ ఆందోళన చెందుతున్నారు. అందుకే మోదీ కేబినెట్‌లో జేడీయూ చేరలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*