నేడు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం… శాఖలు కేటాయించనున్న మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ తొలి సమావేశం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి మోదీ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. నిన్న ప్రమాణం చేసిన వారిలో మోదీ కాకుండా 24 మంది కేబినెట్ మంత్రులుగా 9 మంది సహాయ మంత్రులుగా 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పాత మంత్రులకు అవే శాఖలు కొనసాగిస్తారని సమాచారం. రాజ్‌నాథ్‌కు హోం, నిర్మలా సీతరామన్‌కు రక్షణ, గడ్కరీకి రహదారులు కేటాయిస్తారని తెలుస్తోంది.

కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు కీలకమైన ఆర్ధిక శాఖ కేటాయించే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా జైట్లీ మంత్రిపదవి చేపట్టలేనని స్పష్టం చేయడంతో ఆర్ధిక శాఖ షాకు దక్కినట్లేనని అంచనా వేస్తున్నారు. మోదీ ఆర్ధిక సంస్కరణలను షా వేగంగా ముందుకు తీసుకెళ్లగలరని భావిస్తున్నారు.

ఇక విదేశీ వ్యవహారాల శాఖ చూసిన సుష్మ అనారోగ్యం కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జయ్‌శంకర్‌కు కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. జయ్‌శంకర్‌ను రాజ్యసభకు ఎంపిక చేస్తారు.

 

స్మృతీ ఇరానీకి మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయిస్తారని సమాచారం.

నేటి కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత వేగంగా, హుషారుగా పనిచేయాలని సూచించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*