యోగా మాస్టార్లు కావాలనుకునేవారికి ఆర్‌కే మఠ్ అద్భుత అవకాశం

హైదరాబాద్: యోగా మాస్టార్లు కావాలనుకునేవారికి ఆర్‌కే మఠ్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 9 నుంచి అక్టోబర్ ఆరు వరకూ యోగాధ్యయన్ శిబిర్ నిర్వహించనుంది. నాలుగు నెలల పాటు సాగే ఈ శిబిరంలో నిపుణులైన యోగా మాస్టర్లు దేశ్‌పాండే, లివాంకర్, పవన్‌ల సారధ్యంలో పతంజలి మహర్షి అష్టాంగ యోగ సూత్రాలతో పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు, సూర్య నమస్కారాలు, ధ్యానం గురించి నేర్పిస్తారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద స్వయంగా భగవద్గీత తరగతులు తీసుకుంటారు. స్వామి వివేకానంద కోణంలో కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాల గురించి తరగతులు నిర్వహిస్తారు. భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో, మనసును ఎలా నియంత్రించుకోవాలో నేర్పుతారు. కోర్సు పూర్తయ్యాక థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షల్లో పాసైనవారికి సర్టిఫికెట్లు ఇస్తారు.

ఇవే కాకుండా రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసం, పాజిటివ్ థింకింగ్, గోల్ సెట్టింగ్ వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. బాలల కోసం ప్రత్యేకంగా బాల వికాస్ నిర్వహిస్తున్నారు. మహిళలకూ ప్రత్యేక కోర్సులున్నాయి.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు; సాయంత్రం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 040-27627961, సెల్: 9177232696

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*