ఈ అధ్యక్షుడికి అధర చుంబనమే ఇష్టమట.. పబ్లిక్‌గా ఐదుగురు మహిళలను ముద్దాడిన రోడ్రిగో!

జపాన్ పర్యటనలో ఉన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టి సిగ్గు విడిచారు. ఆడాళ్లను చూసి రెచ్చిపోయాడు. సమావేశంలో ఏకంగా ఐదుగురు మహిళలను చుంబించి తన వెకిలి చేష్టలను ప్రపంచానికి చూపించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్లిన రోడ్రిగో చివరి రోజున జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్‌ వాసులతో టోక్యోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనలోని మగాడిని రోడ్రిగో బయటకు తీశారు.

సమావేశం సందర్భంగా తాను ముద్దుపెట్టుకునేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గర కూర్చుబెట్టుకున్నారు. సమయం రాగానే తొలి మహిళపై అధరాలను చుంబించే ప్రయత్నం చేశారు. ఆమె ఇబ్బంది పడుతూ పెదవులపై వద్దని సంజ్ఞ చేయడంతో చెంపలపై ముద్దుపెట్టుకుని పంపించారు. ఆ తర్వాత మిగతా నలుగురినీ అలాగే బలవంతంగా ముద్దాడారు.

అక్కడితో రోడ్రిగో ఆగలేదు. తాను నంపుంసకుడిని కాకుండా ఈ మహిళలు సాయం చేశారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తాను సాధారణంగా పెదవులపైనే ముద్దులు పెడతానంటూ సిగ్గులేకుండా చెప్పుకొచ్చారు. అధ్యక్షుడి చేష్టలతో అక్కడి వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయినా, ఇబ్బంది పడుతూనే చప్పట్లు కొట్టి ఊరుకున్నారు. 74 ఏళ్ల వృద్ధుడైన రోడ్రిగో ఆ ఐదుగురు మహిళను తన భార్య ఎదుటే ముద్దుపెట్టుకోవడం విశేషం. రోడ్రిగో ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2018 జూన్‌లో సియోల్‌లోనూ ఇదే పనిచేశారు. ఓ వివాహితను ముద్దాడారు. తనకు పెళ్లి అయిందని చెప్పినా వినిపించుకోకుండా ఆమె పెదవులను చుంబించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*