ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. 9న తిరుమలకు ప్రధాని

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ ఈ నెల 9న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

మాల్దీవులు, శ్రీలంక పర్యటన నుంచి భారత్‌కు చేరుకోనున్న మోదీ 9న సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

మోదీ తిరుమల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*